Sofia vergara is tvs highest paid actress for the third year in a row

sofia vergara, sofia vergara hot photos, sofia vergara latest photo shoot, sofia vergana news, sofia vergana forbes magazine

Sofia Vergara is TVs highest-paid actress for the third year in a row : Sofia Vergara is TVs highest-paid actress for the third year in a row by the forbes magazine

ఆ ఒక్క పనితోనే కోట్లు కొల్లగొట్టేసిన సోఫియా!

Posted: 09/05/2014 02:37 PM IST
Sofia vergara is tvs highest paid actress for the third year in a row

(Image source from: Sofia Vergara is TVs highest-paid actress for the third year in a row)

చిత్రపరిశ్రమలో వున్న తారలు డబ్బులు సంపాదించుకోవాలంటే అందుకు చాలా కష్టపడాల్సి వుంటుంది. ముందుగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాల్సి వుంటుంది.. తర్వాత స్టార్ డమ్ ను సంపాదించుకోవడం కోసం నిత్యం శ్రమిస్తూ వుండాలి. తమ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కెరీర్ ను కొనసాగించాలి. అప్పుడు వారికి కొంత డబ్బును పొగేసుకోవడానికి వీలుగా వుంటుంది. అంతకుముందు ఎన్ని అవస్థలు పడి, దొడ్డిదారిలో వెళ్లినా.. స్టార్ డమ్ తో పాటు డబ్బులు సంపాదించడం అంత ఆషామాషీ విషయం కాదు. కానీ ఒక నటి మాత్రం తనకు హాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఏ వుడ్ లతో సంబంధం లేకపోయినా.. కేవలం ఆ ఒక్క పనిచేసుకుంటూ భారీగానే డబ్బులు పొగేసుకుంది. హాలీవుడ్ అగ్రకథానాయికలు సైతం ఆమె ముందు నిలబడలేకపోయారు.

సోఫియా వెర్గారా అనే ఒక టీవీ నటి.. కేవలం బుల్లితెర ద్వారానే కోట్లకు కోట్ల రూపాయలను గడిస్తోంది. ఆ అమ్మడు ఇంతవరకూ ఏ హాలీవుడ్, బాలీవుడ్ మూవీల్లో నటించలేదు... అటువైపు వెళ్లలేదు కూడా! కేవలం టీవీ రంగంలోనే ఒక నటిగా నటిస్తూ నేడు హాలీవుడ్ అగ్రకథానాయికల కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించే తారగా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే కాదు.. వరుసగా మూడుసంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న సర్వేలో సోఫియా మూడుసార్లు హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు నిర్వహించిన సర్వేలో భాగంగా సోఫియా వరుసగా మూడోసారి ‘‘హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్’’గా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది దాదాపు 37 మిలియన్ డాలర్ల సంపాదనను కొల్లగొట్టేసిందని సదరు మ్యాగజైన్ అంచనా వేసింది. ఇక వురిస్కా హర్గిటే అనే నటి 13 మిలియన్ల సంపాదనతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఒకవైపు చిత్రపరిశ్రమలో తారల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ సోఫియా వారందరినీ తలదన్నేసి కోట్ల డబ్బులను తన ఖాతాలో జమ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచేసింది. ఏకంగా మూడుసార్లు తానే టాప్ ప్లేస్ ను దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రముఖులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఒకవైపు టీవీ షోలతో బిజీగా వుంటూ ఇతర ప్రోగ్రాములలో పాల్గొంటూ డబ్బులు బాగనే పొగేసుకుంటోంది. అన్నట్లు ఈ అమ్మడు సినీతారలకు తగ్గకుండా తన హాట్ అందాలను టీవీలోనే ప్రదర్శించేస్తోంది. దాంతో యువకులు సైతం ఈమె షో చూడటానికి ఎగబడుతుంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sofia vergara  forbes magazine  hollywood tv stars  magazine photo shoots  

Other Articles