Lakshmi rai latest photo shoot in ganga movie press meet hyderabad

lakshmi rai, rai lakshmi latest news, lakshmi latest photos, lakshmi rai hot photo shoot, lakshmi rai news, lakshmi rai in ganga movie, lawrence lakshmi rai

lakshmi rai latest photo shoot in ganga movie press meet hyderabad

ఫ్రెష్ మాల్ గా తయారై వచ్చిన లక్ష్మీరాయ్!

Posted: 09/05/2014 03:12 PM IST
Lakshmi rai latest photo shoot in ganga movie press meet hyderabad

(Image source from: lakshmi rai latest photo shoot in ganga movie press meet hyderabad)

బాలయ్య సరసన ‘‘అధినాయకుడు’’ సినిమాలో బికినీ వేసుకుని కుర్రకారు మతిపోగొట్టిన లక్ష్మీరాయ్.. ఆ మూవీ భారీగా పరాజయం కావడంతో తట్టాబుట్టా సర్దుకుని తిరిగి తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ కూడా ఈ అమ్మడికి ఎదురుదెబ్బ తగలడంతో ఆఫర్లకోసం చక్కర్లు కొట్టిన నేపథ్యంలో.. రవితేజ ‘‘బలుపు’’లో ఓ ఐటంసాంగ్ ఆఫర్ వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించకుండా ఓకే అని చెప్పేసి, మాస్ రాజాతో బాగానే స్టెప్పులేసింది. ఆ తర్వాత ఇక్కడ బోలెడన్ని ఆఫర్లు వస్తాయని భావించిన ఆ అమ్మడికి... సినిమాలో ఐటమ్ సాంగ్ బాగానే హిట్ అయినప్పటికీ లక్ష్మీకి మాత్రం ఏ ఆఫర్లు రాలేదు. అంతే! అప్పటినుంచి తిరిగి మన టాలీవుడ్ లో అస్సలు కనిపించలేదు. ఇతర భాషల్లో నటిస్తున్నప్పటికీ.. స్టార్ డమ్ మాత్రం లేదు. దీంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకోవడం ప్రయత్నం దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ అమ్మడు మునుపటిలా కాకుండా చాలా స్లిమ్ గా, ముద్దుముద్దుగా మొత్తం స్కిన్ టోన్ ను మార్చేసి జిగేల్ మనిపించేలా తయారయ్యి.. అందరి దృష్టిని ఆకర్షించింది.

చాలారోజుల తర్వాత హైదరాబాద్ గడ్డపై తిరిగొచ్చిన లక్ష్మీరాయ్.. ఈసారి చాలా స్పెషల్ గానే కనిపించింది. తాను తాజాగా లారెన్స్ తో కలిసి నటిస్తున్న ‘‘గంగా’’ మూవీ గురించి కొన్ని విషయాలను వెల్లడించింది. ఈసారి లారెన్స్ మునుపటి మూవీల్లా కాకుండా వైవిధ్యమైన ఆలోచనతో, ఫ్రెష్ స్టోరీతో ముందుకొచ్చారని ఆమె పేర్కొంది. కాంచన మూవీకి ఏమాత్రం పోలిక లేకుండా సరికొత్త స్టయిల్ తో రూపుదిద్దుకుంటున్న మూవీలో ఇద్దరూ కలిసి నటిస్తున్నట్టు తెలిపింది. ఈ సినిమాలో తామిద్దరు తమతమ క్యారెక్టర్ల కోసం చాలా హోమ్ వర్క్ చేశారని, ఎంతో శ్రమ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. లారెన్స్ ఇందుకు ఒక వర్క్ షాప్ పెట్టి, తనకు - యూనిట్ సభ్యులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో లక్ష్మీ ఒక ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నానని, ఇందులో ఆమెను సరికొత్త అవతారంలో కనువిందు చేయవచ్చునని అమ్మడు పేర్కొంటోంది.

lakshmi-rai-latest-news

మొత్తానికి చెప్పుకోవాలంటే.. ఈ అమ్మడు ఈసారి టాలీవుడ్ మీద బాగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. తెలుగు సినిమాను తర్వాతి లెవల్ కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఢంకా బజాయించుకున్న లక్ష్మీ.. టాలీవుడ్ ని బాగానే పొగిడేసింది. ఇక్కడి అభిమానులు, దర్శకనిర్మాతలు తనకు బాగానే మర్యాదలు చేశారని చెప్పుకొచ్చింది. ఇదిలావుండగా.. చాలారోజుల తర్వాత లక్ష్మీరాయ్ ను చూసిన వాళ్లు మాత్రం అక్కడ సొంగ కార్చేసుకున్నారని తెలుస్తోంది. గతంలో కంటే నాజూగ్గా, సన్నజాజి తీగలా ఎంతో అందంగా తయారయ్యి అందరి మనసుల్ని దోచేసింది. కేరళ ఆయుర్వేద మసాజ్ లో మునిగితేలి వచ్చినట్లు తన స్కిన్ టోన్ గణనీయమైన మార్పులు చేసుకుంది లక్ష్మీ. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే... ఒక ఫ్రెష్ అమ్మాయిగా మారిపోయిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raai lakshmi  ganga movie  lawrence  tollywood  

Other Articles