Prince mahesh babu paragon footwear advertisement released

mahesh babu, tollywood prince, prince mahesh babu, mahesh babu ads, mahesh babu advertisements, mahesh babu bollywood entry, mahesh babu news, mahesh babu latest photo shoot, mahesh babu footwear advertisement, mahesh babu paragon footwear

prince mahesh babu paragon footwear advertisement released

బాలీవుడ్ కి ‘‘చెప్పు’’తో సమాధానమిచ్చిన మహేష్!

Posted: 09/06/2014 06:10 PM IST
Prince mahesh babu paragon footwear advertisement released

(Image source from: prince mahesh babu paragon footwear advertisement released)

ప్రిన్స్ మహేష్ బాబుకి టాలీవుడ్ ఏ రేంజిలో అభిమానుల ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన క్యూట్ స్మైల్ - హ్యాండ్ సమ్ తో అమ్మాయిలను మనసులను... మాస్ యాక్షన్ తో అబ్బాయిల్లో క్రేజ్ సాధించిన ఈ యువనటుడు... ఇప్పుటు తెలుగు పరిశ్రమలో కాదు.. యావత్తు దేశం మొత్తం బాగా పాపులర్ అయిన సెలబ్రిటీ! మహేష్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా క్యూలో వెయిట్ చేస్తున్నారు. అక్కడున్న స్టార్ హీరోలకు సైతం ఈయనంటే పిచ్చ అభిమానం వుంది. ఒకవిధంగా చెప్పాలంటే... బాలీవుడ్ కి మహేష్ ఒక మోస్ట్ వాంటెడ్ హీరో! వాంటెడ్ అంటే ఇంకేమో అనుకునేరు... ఈయన బాలీవుడ్ ఎంట్రీ కోసం అక్కడి దర్శకనిర్మాతలు కాపుకాస్తున్నట్లు దీని సందర్భం! అయితే మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ చిత్రాల్లో ఎప్పటికీ నటించనని తెగేసి చెప్పడంతో వారంతా సైలెంట్ అయిపోయారు.

దేశం మొత్తం మీద మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో ఎవరంటూ ప్రత్యేకంగా కొన్ని మేగజైన్లు పెట్టే నివేదికల్లో మహేష్ స్థానం టాప్ 10లో వస్తున్నాడంటే.. ఈయన క్రేజ్ ఇండియా మొత్తం ఏ విధంగా వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హ్యాండ్ సమ్ లుక్, హైట్, క్లాస్, మాస్.. ఇలా అన్ని కోణాల్లోనూ నిరూపించుకుంటూ దూసుకుపోతున్నాడు ప్రిన్స్! అందుకే.. ఈయనకు దేశం మొత్తం అభిమానులు వున్నారు. దీంతో ఆయన క్రేజ్ ను క్యాచ్ చేసుకోవడానికి కొన్ని కంపెనీలు ఈయనను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ ఒక కూల్ డ్రింక్ యాడ్ లో భారీ స్టండ్ చేస్తూ కనువిందు చేసి, టాలీవుడ్ తో సహా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మహేష్.. తాజాగా మరో వీడియోతో ముందుకు వచ్చాడు. ఈసారి టఫ్ అండ్ స్టైలిష్ కాన్సెప్ట్ తో, ఫైటింగ్ సన్నివేశాలతో వచ్చేశాడు.

పారాగాన్ ఫుట్ వేర్ సంస్థవారు తాజాగా విడుదల చేస్తున్న సరికొత్త బ్రాండ్ చెప్పుల యాడ్ కోసం మహేష్ బాబును ప్రత్యేకంగా సంప్రదించారు. ఇందుకు వెంటనే ఓకే చెప్పిన ఆయనతో ఆ కంపెనీ జబర్దస్త్ యాక్షన్ తో కూడిన ఒక యాడ్ ని ఇటీవలే రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన రిలీజ్ చేసిన ఈ వీడియోకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. బాలీవుడ్ సినీప్రముఖులు ఇది ఎంతో బాగుందని పేర్కొంటుంటే.. టాలీవుడ్ అభిమానులు ఏకంగా ఆకాశానికే ఎత్తేస్తున్నారు. ప్రిన్స్ మేనియా బాలీవుడ్ లో సంచలనమంటూ వ్యాఖ్యలు చేస్తూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  paragon footwear  tollywood  bollywood  

Other Articles