Megastar chiranjeevi 150 movie muhurtham fixed

chiranjeevi, chiranjeevi latest photo shoot, chiranjeevi movies, chiranjeevi 150 movie, chiranjeevi dussehra festival, dussehra festival news, chiranjeevi vv vinayak, chiranjeevi ram charan

megastar chiranjeevi 150 movie muhurtham fixed : tollwood megastar former central minister chiranjeevi will announce his 150 movie details on dussera festival

చిరు 150వ చిత్రానికి ముహూర్తం ఫిక్సయ్యింది!

Posted: 09/09/2014 02:41 PM IST
Megastar chiranjeevi 150 movie muhurtham fixed

ప్రస్తుతం టాలీవుడ్ లో చిరు 150వ సినిమా హాట్ టాపిక్ గా మారిపోయింది. చిరంజీవి తన పుట్టినరోజే 150వ సినిమా గురించి ఏమైనా వివరాలు ప్రకటిస్తారని అభిమానులు ఆశపడిన నేపథ్యంలో వారికి అడియాశలే మిగిలాయి. అప్పట్లో కథ ఇంకా ఓకే కాకపోవడంతోనే చిరు మూవీ గురించి నోరు మెదపలేదు. అప్పటి నుంచి ఈయన మూవీకి సంబంధించిన విషయాలు సస్పెన్స్ గానే మిగిలిపోయాయి. తమ అభిమాన నటుడు 150వ చిత్రం గురించి ఎప్పుడు వివరాలు తెలియపరుస్తాడు.. ఎప్పుడు తెరమీద కనువిందు చేస్తాడంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇంకా కొన్ని కథలు వినాలంటూ ప్రకటించి.. ఆ పనిలో బిజీ అయిపోయారు. అలాగే ఆయన తన బాడీ షేప్ ని కూడా ఛేంజ్ చేసుకున్నారట!

ఇదిలావుండగా.. తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. చిరంజీవి తన 150వ చిత్రానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రచారాలు సాగుతున్నాయి. దసరా పండుగనాడు ఆయన తన మూవీ వివరాల గురించి తెలియపరిచే అవకాశాలున్నాయంటూ టాక్ వినిపిస్తోంది! ఇంతవరకు ఆయన చదివిన కథలలో కొన్ని ప్రత్యేకంగా ఎంచుకుని వాటిని పక్కన పెట్టుకున్నారని.. అందులో నుంచి ఏది బాగుంటే దానిని ఎన్నుకునే అవకాశం వుందని.. అలా కాకపోతే ఆ స్ర్కిప్ట్ లలో వున్న కొన్ని మంచి సన్నివేశాలను జోడించి.. దాంతో ఒక కథ తయారుచేసే ఆలోచనల్లో వున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. కామెడీ ఎంటర్టైన్ మెంట్ తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించి చిరు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారని తెలుస్తోంది.

అలాగే కథ పేరుతో ప్రేక్షకుల్ని ఇంకా కాలయాపన చేస్తే బాగోదని.. అభిమానులు ఎక్కువగా వెయిట్ చేయించడం మంచిది కాదని చిరు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తన 150వ చిత్రానికి సంబంధించిన పనులన్నింటినీ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని తీసి పెట్టుకున్న కథల్లో ఏది మంచిదోనన్న విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్! ఇక ఈ మూవీకి కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని టాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే చిరు 150వ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాలంటే.. దసరా వరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  chiru 150 movie  vv vinayak  tollywood  ram charan  

Other Articles