Tamil actor producer udhayanidhi maran filed case on kajal agarwal in kollywood producers council

kajal agarwal, kajal agarwal latest news, kajal agarwal kollywood news, udhayanidhi maran, udhayanidhi maran kajal agarwal, udhayanidhi maran nanbenda movie, nanbenda movie news, kajal agarwal case

tamil actor producer udhayanidhi maran filed case on kajal agarwal in kollywood producers council

డబ్బులు తీసుకుని ఉడాయించిన కాజల్! కేసు ఫైల్!

Posted: 09/10/2014 10:25 AM IST
Tamil actor producer udhayanidhi maran filed case on kajal agarwal in kollywood producers council

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ స్టార్ కథానాయికగా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ కోలీవుడ్ దుమారం రేపుతోంది. ఇదేదో మూవీకి సంబంధించిన వ్యవహారంగానీ, ఏ ఇతర కామెడీ ట్రాక్ అయితే మాత్రం కాదు. ఇంతవరకు ఎన్నడూలేని విధంగా కాజల్ అందరికీ దిమ్మతిరిగిపోయేలా తన నిజస్వరూపాన్ని బయటపెట్టేసింది. దీంతో ఈ వార్త ప్రస్తుతం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాజల్ కూడా ఇటువంటి వ్యవహారాలకు ఒడిగడుతుందా అంటూ సినీప్రముఖుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

కాజల్ అగర్వాల్ మీద తాజాగా తమిళ నిర్మాతల మండలిలో ఓ కంప్లైంట్ నమోదయినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ఆ ఫిర్యాదు చేసింది కూడా ఎవరో కాదు... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మనుమడు - నిర్మాత - హీరోగా కొనసాగుతున్న ఉదయనిధి స్టాలిన్! ప్రస్తుతం తాను నటిస్తున్న ‘‘నన్బెందా’’ చిత్రంలో కాజల్ నటించడానికి ఒప్పుకుని, చివరికి డేట్స్ కేటాయించలేదని అతను ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. ఆ చిత్రానికి అతను ఆమెకు అడ్వాన్సుగా నలభై లక్షల రూపాయలు కూడా ముట్టజెప్పాడని.. ఇంతవరకు ఆ మొత్తాన్ని ఆమె తనకు తిరిగి ఇవ్వలేదని ఉదయ్ ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా ఒక చిత్రనిర్మాత ఇలా హీరోయిన్ల మీద ఫిర్యాదు చేస్తే.. అది పెద్ద దుమారాన్నే రేపదు. పైగా కొన్నిరోజుల అనంతరం నిర్మాతే తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని సైలెంట్ గా వుండిపోతాడు తప్ప.. సదరు హీరోయిన్లు అందుకు సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ స్టాలిన్ ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గానే మారింది. మాజీముఖ్యమంత్రి మనుమడు అయిన స్టాలిన్.. ఇటువంటి వ్యవహారాల్లో ఏమాత్రం వెనక్కు తగ్గడని.. దీంతో కాజల్ కష్టాలను కొనితెచ్చుకుందని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మరి.. దీనిపై కాజల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  udhayanidhi maran  kollywood news  nanbenda movie  

Other Articles