Ram gopal varma controversial comments on manchu vishnu

manchu vishnu, ram gopal varma, manchu vishnu latest news, manchu vishnu anukshanam movie, manchu vishnu ram gopal varma, anukshanam movie news, ram gopal varma fires manchu vishnu

ram gopal varma controversial comments on manchu vishnu : in the promotion of anukshanam movie.. manchu vishnu reveals the relationship between their family with ramgopal varma

మంచువిష్ణుని నోటినిండా తిట్టేసిన రాంగోపాల్ వర్మ!

Posted: 09/10/2014 12:40 PM IST
Ram gopal varma controversial comments on manchu vishnu

భారతదేశంలో ఏకైక సంచలన దర్శకుడిగా పేరు నమోదు చేసుకున్న రాంగోపాల్ వర్మ.. మరోసారి వివాదస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు. అది కూడా ఆయనతోపాటు కలిసి సినిమాలు చేసిన హీరో - నిర్మాత మంచు విష్ణుని డైరెక్ట్ గా తిట్టిపారేశాడు. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇదివరకే వర్మ మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి ‘‘రౌడీ, అనుక్షణం’’ అనే మూవీలను తెరకెక్కించిన నేపథ్యంలో... అప్పుడే ఇలా వివాస్పద వార్తలు రావడంపై అందరూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు వర్మ, విష్ణుని ఎందుకు తిట్టాడు..? వారిద్దరి మధ్య ఏం జరిగిందనే ఆలోచనలలో తీవ్రంగా మునిగిపోయారు.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా తెరకెక్కించిన ‘‘అనుక్షణం’’ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇందులోభాగంగానే తన మూవీ ప్రమోషన్ కోసం ఫుల్ బిజీగా వున్న మంచు విష్ణు.. తనకూ, వర్మకు మధ్య జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను విశదీకరించారు. వ్యక్తిగత విషయాలలో తమ మధ్య చాలా విభేదాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. కొన్ని వివాదాస్పమైన అంశాల్లో తమ మధ్య తరుచూ గొడవలు జరుగుతూ వుంటాయని.. అయితే బిజినెస్ పరంగా మాత్రమే ఆయనతో కలిసి సినిమాలు చేస్తున్నామనే రీతిలో తమ మధ్య వున్న బంధాన్ని విష్ణు వివరించారు. తమ మధ్య జరిగే ఆ గొడవల నేపథ్యంలో వర్మ తనను నోటినిండా తిట్టేస్తుంటారని తెలిపారు. అందుకు విష్ణు ఒక ఉదాహరణను తెలిపారు.

ఇటీవలే వినాయకునిపై వర్మ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే! దేశవ్యాప్తంగా వర్మపై రకరకాల విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్మ తీరుపై ఆగ్రహం చెందిన విష్ణు.. ‘‘మా మనోభావాలను దెబ్బతీసే రీతిలో మాట్లాడటానికి మీరెవరు?’’ అని సూటిగా అడిగాడట! అందుకు ఆయన ‘‘ఏం చేస్తారు..?’’ అంటూ మొండిగా వాదించడం మొదలుపెట్టేశారని తెలిపారు. ఈ గొడవ సందర్భంలో తనను ‘‘నువ్వు నూటయాభై ఏళ్ల క్రితం మనిషిలా వున్నావ్’’ అంటూ విమర్శించినట్టు విష్ణు తెలిపారు. అయితే ఇటువంటి వ్యక్తిగత విభేదాల తరుచూ తమ మధ్య వున్నప్పటికీ.. ఆయనతో కలిసి పనిచేయడం తనకు గర్వకారణంగా వుందని చెప్పుకొచ్చాడు.

వర్మ గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ.. ‘‘మూసలో కొట్టుకుపోతున్న బారతీయ సినిమాకు వర్మ ఓ దిశను నిర్దేశించిన దర్శకుడంటూ ఆకాశానికెత్తారు. ఆయనతో సినిమాలు తీస్తే ఏ నిర్మాత నష్టపోడంటూ వెల్లడించారు. దేశం గర్వించదగ్గ దర్శకుడు వర్మ అని తెలిపిన ఆయన.. అటువంటి దర్శకునితో కలిసి పనిచేస్తున్నందుకు తానెంతో గర్విస్తున్నానని తెలిపాడు. తమ మధ్య వున్న వ్యక్తిగత అంశాలను పక్కనపెడితే.. దర్శకునిగా మాత్రం వర్మ ఒక లెజెండ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu vishnu  ram gopal varma  anukshanam movie  tollywood media  

Other Articles