Tamil actress khushboo fires on shweta basu prasad affair

tamil actress khushboo, khushboo latest news, khushboo comments shweta basu prasad, shweta basu prasad news, shweta basu prasad movies, shweta basu prasad prostitution

tamil actress khushboo fires on shweta basu prasad affair

అవకాశాలు లేకపోతే.. వ్యభిచారం చేయాలా? ఖుష్బూ

Posted: 09/10/2014 03:12 PM IST
Tamil actress khushboo fires on shweta basu prasad affair

వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన శ్వేతబసు విషయంలో రానురాను అభిప్రాయాలు చాలా ఎక్కువ వెలువడుతున్నాయి. కుటుంబఆర్థిక పరిస్థితుల వల్లే తాను ఈ రొంపిలోకి వచ్చినట్టు శ్వేత తెలిపిన నేపథ్యంలో.. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకున్న కొంతమంది సినీ ప్రముఖులు ఈమెకు మద్దతుగా తమ వాదనలను వినిపించారు. మీడియా, పోలీసులు శ్వేత విషయంలో చాలా అనైతికంగా వ్యవహరించారని.. ఆమెతోపాటు పట్టుబడిన వారి వివరాలను బయటకు రానివ్వకుండా తనను అమాయకురాలు చేసి ఆడుకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇంకా రకరకాలుగా ఈమెకు వత్తాసు పలికారు. మరికొందరు శ్వేత వ్యభిచారంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేసిందని అభిప్రాయాలు తెలిపినప్పటికీ.. ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇవ్వడానికి మాత్రం వెనుకంజ వేస్తున్నారు.

కానీ.. కోలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ఏమాత్రం మొహమాటం లేకుండా శ్వేత చేసిన పని తప్పేనంటూ ఓపెన్ గా వ్యాఖ్యలు చేస్తోంది. అందరిలాగా ఈమె శ్వేతను వెనకేసుకురాకుండా.. తనదైన శైలిలో కామెంట్లు చేశారు. సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినంతమాత్రాన.. వ్యభిచారంలో దిగిపోవాలా..? అంటూ ఏకిపారేశారు. ఈ నేపథ్యంలోనే ఖుష్బూ మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు లేకపోతే సీనియల్స్ లోనో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో ప్రయత్నాలు చేయాలి. ఇలా ఎంతమంది హీరోయిన్లు అవకాశాలు లేకుండా వున్నారు. వారందరూ ఇతర పనులు చేసుకుంటూ హాయిగానే వున్నారు కదా! అవకాశాలు లేవని వ్యభిచారంలోకి దిగలేదు. అయితే శ్వేత అవకాశాలు లేవని చెప్పి వ్యభిచారంలోకి దిగానని చెప్పుకోవడం సమర్థనీయం కాదు’’ అంటూ కడిగిపారేసింది.

‘‘అయినా.. ఇటువంటి చర్యల్ని ఏ తల్లిదండ్రులు అంగీకరిస్తారో చెప్పండి..? ఇతర హీరోయిన్లకు అవకాశాలు లేకపోతే ఎంచక్కా ఇతర బిజినెస్ లు, సీరియళ్లు చేసుకుని బతుకుతున్నారు. అటువంటి మార్గాన్ని ఎంచుకోవాల్సిందిపోయి.. వ్యభిచారంలోకి దిగడం ఎంతమాత్రం సమంజసం కాదు. శ్వేత విషయంలో ఆమె కంటే తల్లిదండ్రుల్నే తప్పుపట్టాలి’’ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక్కడ ఖుష్బూ చెప్పిన మాటలను దీర్ఘంగా ఆలోచిస్తే.. ఆమె చెప్పింది కరెక్టేనని నమ్మక తప్పదు. సినిమాల్లో ఆఫర్లు లేకపోతే.. ఇంకా బోలెడన్ని అవకాశాలుంటాయి. ఆ కోణంలో వెళ్లాల్సిందిపోయి.. వ్యభిచారంలోకి వెళ్లడం శ్వేత తీసుకున్న నిర్ణయం తప్పేనని చెప్పక మానదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khushboo  shweta basu prasad  prostitution  kollywood fire brand  

Other Articles