దీపికా పదుకునే, అర్జున్ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘‘ఫైండింగ్ ఫెనీ’’... విడుదల కాకముందే సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అయితే రికార్డులపరంగా కాదులెండి.. వివాదాలపరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీలో ‘‘వర్జిన్’’ అనే పదం వాడినందుకు సెన్సార్ బోర్డు అధికారులు అభ్యంతరం తెలుపుతూ దానిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దీపికా పదుకునే, యూనిట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి ఆ పదాన్ని ఎలాగోలా జోడించేశారు. దీంతో ఈ వివాదం తెరపడిందని అనుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త సమస్యలో ఇరుక్కుపోయింది. ఈసారి మూవీకి సెన్సార్ నుంచి కాదు.. డైరెక్ట్ గా కోర్టు నుంచే ముప్పు వాటిల్లే పరిస్థితులు వున్నట్లు తెలుస్తోంది.
హోమి అడజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ లోని ‘‘ఫెనీ’’ అనే పదం సెక్సువాలిటీకి సంబంధించిందని.. ముఖ్యంగా ఇది పిల్లలపై ప్రభావం చూసే అవకాశం వుందని అభ్యంతరం తెలుపుతూ జై జాగృతి ఫౌండేషన్ కు చెందిన నందిని తివారీ ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. అలాగే ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన పదాలను కూడా ఉపయోగించారని.. ఎక్కువగా సెక్సవాలిటీని తలపించే వ్యాఖ్యాలను పొందుపరిచిన ఈ మూవీ.. భారతీయ మనోభావాలను కించపరిచేలా వుందని ఆమె పిల్ లో పేర్కొన్నారు. ముందుగా మూవీ టైటిల్ ‘‘ఫైండింగ్ ఫెనీ’’ నుంచి ‘‘ఫెనీ’’ అనే పదాన్ని తొలగించాలని.. అలాగే ఇందులో ఉపయోగించిన మరికొన్ని సెక్సువల్ పదాలను తీసేయాల్సిందిగా కోరుతూ ఆమె పిల్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 12వ తేదీ (శుక్రవారం) విడుదలకు సిద్ధంగా వున్న ఈ మూవీకి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేయడంతో.. ఇది రిలీజ్ కాకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇందులో సదరు పదాలను వాడాల్సి వచ్చిందని.. ఆ పదాలు ఇందులో చాలా ముఖ్యమైనవి అని డైరెక్టర్ పేర్కొంటున్నారు. ఒకవేళ అవి తీసేయాల్సి వస్తే.. సదరు సన్నివేశాలు సరిగ్గా కుదరవని.. వాటిని దృష్టిలో పెట్టుకునే ఇలా కొన్ని పదాలను ఉపయోగించాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. మరి తాజాగా దాఖలైన ఈ పిల్ పై కోర్టు ఎలా తీర్పునిస్తుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more