Kajal agarwal is ready to give back her advance money to udhayanidhi stalin

kajal agarwal, kajal agarwal latest news, kajal agarwal hot photos, kajal agarwal hot photo shoot, kajal agarwal latest news, kajal agarwal udhayanidhi stalin, udhayanidhi stalin news, udhayanidhi stalin kajal agarwal, nanbenda movie

kajal agarwal is ready to give back her advance money to udhayanidhi stalin

సెటిల్ మెంట్ చేయడానికి రెడీ అంటున్న కాజల్!

Posted: 09/13/2014 06:34 PM IST
Kajal agarwal is ready to give back her advance money to udhayanidhi stalin

(Image source from: kajal agarwal is ready to give back her advance money to udhayanidhi stalin)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఈమధ్య సెటిల్మెంట్లు చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా సాగుతున్నాయి. తెలుగు, హింధీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడికి.. సెటిల్మెంట్లు చేసుకోవాల్సిన అవసరమేముందని అనుకుంటున్నారా..? కొన్ని కొన్ని సందర్భాల్లో మొండిగా వ్యవహరిస్తే.. చేతులు ఖచ్చితంగా కాలుతాయనే సూత్రాన్ని ఈ అమ్మడు అర్థం చేసుకోని వుండొచ్చు. అందుకే సెటిల్మెంట్ చేయడానికి రెడీ అంటూ ముందుకు వస్తోంది. అయితే అది ఏ విషయంలో అని సంధిస్తున్నారా..? అలా అయితే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఇటీవలే రాజకీయ కుటుంబానికి చెందిన హీరో - నిర్మాత ఉదయనిధి స్టాలిన్, కాజల్ అగర్వాల్ మీద తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే! ప్రస్తుతం స్టాలిన్ నటిస్తూ నిర్మిస్తున్న ‘‘నన్బెండా’’ చిత్రంలో మొదట కాజల్ ను బుక్ చేసుకున్న ఈ హీరో.. ఆమెకు అడ్వాన్స్ గా రూ.40 లక్షలు సమర్పించుకున్నాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి డేట్స్ కుదరడం లేదంటూ కాజల్ తప్పుకుంది. కానీ, తీసుకున్న అడ్వాన్స్ మాత్రం అతనికి తిరిగి ఇవ్వలేదు. దీంతో అతను తన సినిమాలో నటించడానికి డేట్స్ ఇవ్వకుండా రూ.40 లక్షలు ఉడాయించిందంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. తన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతూ అతను నిర్మాతల మండలి ద్వారా ఆమెకు హెచ్చిరికలు జారీ చేయించాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న కాజల్ అమ్మడు... తాను స్టార్ హీరోయిన్ స్థాయిలో వున్నాననే కాస్త యాటిట్యూడ్ తో అందుకు గట్టిగానే రియాక్ట్ అయింది. తాను ముందుగానే కేటాయించినట్టు స్టాలిన్ కు డేట్స్ ఇచ్చానని, అయితే వారు వాటిని సద్వినియోగం చేసుకోకుండా తన టైమ్ వేస్ట్ చేశారని... ఆ క్రమంలోనే తాను ఓ తెలుగు చిత్రాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. దాంతో స్టాలిన్ వల్ల తాను చిత్రాన్ని కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి... అతనిచ్చిన అడ్వాన్సు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వననీ పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. అవసరమైతే ఈ విషయంలో తాను కూడా ఆర్టిస్టుల సంఘంలో ఫిర్యాదు చేస్తానని కూడా మొండికేసింది. అయితే.. ఇంతలోనే ఏమయిందో ఏమో గానీ.. వున్నట్టుంది ఈ అమ్మడు ప్లేట్ ఫిరాయించేసింది. తాను డబ్బులు తిరిగి ఇవ్వడానికి రెడీ అంటూ చెబుతోందని వార్తలు వస్తున్నాయి.

ఉదయనిధిలాంటి రాజకీయ నేపథ్యమున్న మనిషితో వివాదాలు పొడిగించుకుంటే శ్రేయస్కరం కాదని.. భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని భావించిన కాజల్ అగర్వాల్... తమ మధ్య వున్న వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం దిగివచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని త్వరగా ముగించేయాలంటూ సెటిల్మెంట్లకు ప్రయత్నిస్తోందట ఈ మూడుపదుల హాట్ బామ! ఇందులో భాగంగానే మధ్యవర్తుల ద్వారా ఉదయ్ తో కాజల్ చర్చలు జరుపుతోందని.. అవసరమైన తన అడ్వాన్సు కూడా తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా వున్నానని చెబుతున్నాట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా.. ఇక్కడ కాజల్ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయమే తన భవిష్యత్తుకు చాలా మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles