Rajamouli to conduct cricket match

rajamouli, ss rajamouli, rajamouli movies, bahubali, bahubali team, bahubali release, bahubali songs, bahubali prabhas images, prabhas, prabhas images, prabhas movies, raana, rana movies, rana latest, rana with trisha, prabhas sharmila affair, cricket, cricket matches, bahubali cricket match, latest news

director rajamouli planned to conduct a cricket match to bahubali prabhas and rana teams : for publicity and promotions rajamouli planning a cricket match between raana and prabhas teams

జక్కన్న దానికోసం ఏదైనా చేస్తాడు

Posted: 09/14/2014 06:08 PM IST
Rajamouli to conduct cricket match

కొంతకాలంగా టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు రాజమౌళి. జక్కన్న సినిమా అంటే చాలు.., తెలుగు ప్రేక్షకులు నిర్భయంగా థియేటర్ కు వెళ్తున్నారు. అటు హీరోలు కూడా కాల్షీట్లు కట్టిపెట్టి మరీ డేట్లు అడ్జస్ట్ చేసి నటించేందుకు సిద్దం అవుతున్నారు. అంత క్రేజ్ ఉంది మరి జక్కన్నకు. సినిమాలు తీయటమే కాదు.., వాటి విడుదల, ప్రమోషన్లలో కూడా ఆయనదంతా ఒక స్టైల్. ప్రమోషన్ విషయంలో రాజును చూసి చాలా నేర్చుకోవాలంటారంతా. అలాగే తన భారీ బడ్జెట్ సినిమా బాహుబలి ప్రమోషన్ల కోసం కొత్త ఎత్తులు వేస్తున్నారు. పర్యటనలు, సినిమా షాట్లతో ప్రమోలకు బదులు కొత్త ట్రిక్ ప్రయోగించారు.

అదే క్రికెట్ మ్యాచ్. మామూలుగా క్రీడాకారుల క్రికెట్ తెలుసు. సినీ తారల క్రికెట్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక సినిమా క్రికెట్ వచ్చింది. సినిమాలో హీరో, విలన్ల మద్య పోరులా.., ఇక్కడ కూడా హీరోలు, విలన్లు పోటి పడుతున్నారు. బాహుబలి సినిమా హీరో ప్రభాస్, విలన్ రానాతో టీంను ఏర్పాటు చేసి జక్కన్న క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేశాడు. దీనివల్ల క్రేజ్ ఉన్న తారలు, మరింత క్రేజ్ ఉన్న క్రికెట్ ఆడితే దానికి వచ్చే క్రేజ్ ఏంటో పసిగట్టాడు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాడు. రెండు టీంల మద్య మ్యాచ్ పెట్టి.., దాన్ని వీడియో తీసి ఎడిటింగ్ చేసి ప్రమోషన్ గా విడుదల చేస్తారట.

ఇప్పటికే బాహుబలి ప్రోమోలకు విపరీతమైన క్రేజ్ రావటంతో.., ఈ వీడియోకు కూడా  బాగా పాపులారిటీ వస్తుందని భావిస్తున్నాడు. ఈమద్యే షూటింగ్ కు కాస్త విరామం  ప్రకటించిన జక్కన్న టీం..., ఇప్పుడు మ్యాచ్ పై దృష్టిపెట్టారన్నమాట. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న బాహుబలి భారీ బడ్జెట్ సినిమాలో రాణా విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. అనుష్క, తమన్నా సినిమాలో హీరోయిన్లుగా ఉన్నారు. టాలీవుడ్ చరిత్రలో ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 
కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  prabhas  promo  latest news  

Other Articles