Reasons behind ram gopal varma and srinu vaitla controversy

controversy, ram gopal varma, ram gopal varma movies, ram gopal varma latest news, ram gopal varma loans, ram gopal varma creditors, ram gopal varma ice cream 2, ice cream 2 audio, srinu vaitla, srinu vaitla movies, aagadu, aagadu review, aagadu movie download, ram gopal varma comments, ram gopal varma comments on aagadu, tollywood, latest news

here we come to notice reasons behind controversy of ramgopal varma and srinu vaitla : ksd appal raju movie song is the reason behing varma vaitla controversy

వర్మ.. వైట్ల మద్య చిచ్చుపెట్టిన ‘‘అప్పల్రాజు’

Posted: 09/20/2014 03:12 PM IST
Reasons behind ram gopal varma and srinu vaitla controversy

వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆగడు సినిమాపై చేసిన విమర్శలు ట్విట్టర్ తో పాటు, టాలీవుడ్ లో కూడా సంచలనంగా మారుతున్నాయి. సినిమా విడుదలైన కొద్ది గంటల్లో ఆగడుపై నేరుగా విమర్శలు చేసి మరోసారి వార్తల్లోకెక్కారు వర్మ. దీనికి ప్రిన్స్ ఫ్యాన్స్, ఇతరులు కూడా గట్టిగానే కామెంట్లు పంపారనుకోండి. అయితే ఈ వివాదానికి కారణం.. వర్మకు వైట్ల కడుపు మండేలా చేయటం అని తెలుస్తోంది. అటు వర్మకు కోపం వచ్చేలా వైట్ల ప్రవర్తించడానికి కారణం గోపాలుడి చిలిపి చేష్టలే అని తెలుస్తోంది. ముందు వర్మ మొదలు పెట్టిన ఈ వివాదం ప్రస్తుతం ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

వర్మ తీసిన ‘‘కే.ఎస్.డీ. అప్పల్రాజు’’ సినిమాలో ‘‘ లక్కుతో శివ సినిమా తీసెయ్’’ అనే పాట ఉంది. అందులో మద్యలో శ్రీనువైట్లను విమర్శించేలా ‘‘ నమో వెంకటేష అన్న శ్రీనువైట్లకు పంగనామమే మిగిలెను చివరికి’’ అని లైన్లు ఉన్నాయి. దీంతో శ్రీనుకు కోపం వచ్చిందట. వర్మ సినిమా తీసుకోవటం ఆయన ఇష్టం, తాను సినిమా తీసుకోవటం తన ఇష్టం. అలాంటప్పుడు ఎందుకు విమర్శించటం అని సీరియస్ గా తీసుకున్నాడు. వర్మ సినిమాలో వైట్లను విమర్శిచటంతో.. వైట్ల సినిమాల్లో కూడా వర్మ టార్గెట్ గా కొన్ని మాటలు, డైలాగులు ఉండేలా మరీమరీ శ్రీను జాగ్రత్తలు తీసుకున్నాడు. ఉదాహరణకు ‘‘దూకుడు, బాద్ షా’’ సినిమాల్లో రామ్ గోపాల్ వర్మను కామెంట్ చేసేలా, ఆయనను ఇమిటేట్ చేసేలా కొన్ని డైలాగులు ఉండటం అందరికి తెలుసు. ఇలా వర్మపై శ్రీను కసి తీర్చుకుంటున్నాడు.

అరె.., అందరిపై కామెంట్ చేసే తననే.. శ్రీనువైట్ల టార్గెట్ చేస్తాడా.. అని వర్మకు కూడా కోపం వచ్చింది. దీంతో సమయం కోసం ఎదురుచూసి తన కామెంట్ పవరేంటో చూపించాడు. ఆగడు సినిమా విడుదల రోజున.. శ్రీనువైట్ల డైరెక్షన్ ఎలా ఉందో.. మొత్తంగా ఆగడు సినిమాను తిట్టి పారేశాడు. ఈ కామెంట్లు ట్విట్టర్ లో సంచలనంగా నిలిచాయి. ఉదయమే వర్మ గురించి ఓ వార్త తెలిసినా.. అంతగా పట్టించుకోని టాలీవుడ్ ఫ్యాన్స్, ఆయన చేసిన కామెంట్లను మాత్రం బాగా సెర్చ్ చేశారు.

వర్మ కామెంట్లు చూస్తే..

‘ఆగడు’ సినిమా చూసిన వెంటనే ట్విట్టర్ అకౌంట్ లో ఆన్ లైన్లోకి వచ్చిన రాం గోపాల్ వర్మ.., తన మనస్సులో ఉన్న అసంతృప్తినంతా బయట పెట్టాడు. వర్మ ఏమన్నాడంటే.. ‘‘ ఇప్పుడే ఆగడు సినిమా చూశాను.. ఇక దూకుడు, బిజినెస్ మెన్ సినిమాలతో పాటు పోకిరి కూడా  చూస్తాను. మహేష్ కూడా ఇప్పుడు ఇదే చేస్తాడని నేను మనసారా భావిస్తున్నాను’’ అని తొలి కామెంట్ చేశాడు.

‘ ఆగడు సినిమా డెబ్బయి ఐదు కోట్లు పెట్టి తీశారని.., కాని ఇదే సమయంలో మగధీరను చూస్తే 750 కోట్లు పెట్టి తీసినట్లు ఉంటుందని చెప్పాడు. ఈ సందర్బంలో మగధీర అంత డబ్బు ఖర్చుపెట్టి తీయకపోయినా..,  ఆ స్థాయిలో ఉండటంతో పాటు.., కలెక్షన్ల పరంగా కూడా రికార్డు సృష్టించిందని రెండవ కామెంట్ చేశాడు.

‘‘ మగధీర, ఆగడు రెండు సినిమాలు ఇద్దరు హీరోలకు భారీ బడ్జెట్ సినిమాలని చెప్పాడు. అయితే మగధీర రామ్ చరణ్ కు భారీ హిట్ ఇస్తే.., ఆగడు మాత్రం మహేష్ అంచనాలను అందుకోలేకపోయిందని మూడవ కామెంట్ లో విమర్శించాడు.

ఈ కామెంట్ల యుద్దం.., సినిమాల్లో సెటైర్లకు వీలైనంత త్వరగా ముగింపు పలకకపోతే ఇద్దరికీ ప్రమాదమే అని టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. ఇద్దరూ కూర్చని మాట్లాడుకుని చర్చించుకుంటే వివాదం పరిష్కారం అవుతుంది. లేదంటే ఇదిమరింత పెద్దది కావటం ఖాయం. మరి ఇద్దరిలో ముందు ఎవరు దిగివస్తారనేది వారికే తెలియాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  srinu vaitla  mahesh babu  aagadu  

Other Articles