I movie rights sold to 102crore rupees

shankar, shankar movies, latest news, shankar i movie, shankar latest news, i movie release date, i movie trailor, i movie audio launch, i movie songs, i movie telugu songs, i movie vikram, i movie stills, koliwood, bollywood, tollywood, i movie telugu songs, i movie telugu songs released, latest news

shankar's latest sensation i movie collections are very even before its release by movie rights bought by 102crore rupees : i movie which is going to release on 23october is collected 102crore rupees till now

విడుదలకు ముందే 100కోట్లు దాటిన ‘ఐ’ కలెక్షన్లు

Posted: 09/20/2014 03:46 PM IST
I movie rights sold to 102crore rupees

శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమా విడుదలకు ముందే సంచలనాలను నమోదు చేస్తుంది. ఇప్పటివరకు తమిళ ఇండస్ర్టీలో ఏ సినిమాకు లేని క్రేజ్ ‘ఐ’ సినిమాకు వస్తోంది. సోమవారం తమిళంలో రిలీజ్ అయిన ‘ఐ’ ఆడియో రికార్డులు సృష్టిస్తోంది. ఇక మరొక విషయం ఏమిటంటే ‘ఐ’ మూవి ట్రైలర్ కూడా యూ ట్యూబ్ లో సంచనాలను నమోదు చేస్తోంది. ఇప్పటివరకు నాలుగు మిలియన్లకు పైగా నెటిజన్లు ఈ వీడియోను చూశారు. తమిళ ఇండస్ర్టీ కి చెందిన ఏ వీడియోను ఇంతగా చూడలేదు. ఈ సినిమా విడుదలకు ముందే మరో రికార్డు కూడా సాధించింది.

‘ఐ’ వస్తున్న ప్రజాదరణ సినిమా యూనిట్ కు కోట్లు కుమ్మరింపచేస్తోంది. ఈ సినిమా హక్కులను రూ.102కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. వీటిలో వివిధ బాషల్లో విడుదల చేసే హక్కులతో పాటు, ఓవర్సీస్, షాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయని తమిళ వర్గాలు అంటున్నాయి. ఒక తమిళ సినిమా విడుదలకు ముందే ఇంత మొత్తంలో కలెక్షన్లు వసూలు చేయటం ఇదే తొలిసారి. దీంతో సినిమా యూనిట్ పండగ చేసుకుంటోంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఒక పాట షూట్ చేయాల్సి ఉంది. అందుకోసం భారీ సెట్టింగును వాడటంతో పాటు శంకర్ ప్రాధాన్యమిచ్చే గ్రాఫిక్స్ వండర్స్ కలుపుతున్నారు. అందువల్లే లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

సోమవారం రోజు ఈ సినిమా ఆడియోను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్ విడుదల చేశారు. తెలుగులో పాటలు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. అక్టోబర్ 23న దీపావళి కానుకగా విడుదల చేయాలి అనుకుంటున్నా.. ఎఫెక్ట్స్ కారణంగా కాస్త ఆలస్యం అవుతుందని తమిళ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విక్రమ్, అమీజాక్సన్ ‘ఐ’ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా., ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా ఉన్నాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  shankar  vikram  film news  

Other Articles