I movie telugu audio release date on october 2nd

i movie, shankar i movie, i movie trailor, i movie latest news, i movie audio release, i movie audio launch, i movie audio download, i movie audio songs free download, i movie posters, i movie vikram, i movie shankar, i movie release date, i movie telugu audio, manoharudu, film news, tollywood, bollywood, koliwood, latest news

i movie telugu version audio release date fixed by october 2nd : shankar vikram great movie i telugu versions songs will available from october 2nd to telugu audience

‘ఐ’ తెలుగు ఆడియో విడుదల తేదీ ఖరారు

Posted: 09/21/2014 10:07 AM IST
I movie telugu audio release date on october 2nd

‘ఐ’ సినిమా తెలుగు పాటల విడుదల తేది ఖరారయింది. ప్రస్తుతం తమిళంలో విడుదల అయిన ఈ సినిమా పాటలు అక్కడ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే అక్టోబర్ 2న ఆడియో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దసరా కానుకగా తెలుగు ప్రేక్షకులకు ‘ఐ’ సినిమా ఆడియో వస్తోంది. తమిళ పాటల విడుదలకు ఆర్నాల్డ్, రజినికాంత్ వంటి ప్రముఖులు హాజరుకాగా... తెలుగు వర్షన్ పాటల విడుదలకు ఎవర్ని ఆహ్వానిస్తారనేది తెలియాల్సి ఉంది.

తెలుగు పాటల విడుదలకు ‘ఐ’ సినిమా హీరో విక్రమ్ హాజరవుతారని ఫిలింనగర్ టాక్ విన్పిస్తోంది. అయితే ఇతర ప్రముఖుల విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమా హక్కులు ఇప్పటికే రూ.102కోట్లకు పైగా వసూలు చేసి పెట్టాయి. దీంతో డిస్ర్టిబ్యూటర్లు భారీ లాభాలను ఆశిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు చెప్తున్నా.., ఒక పాట షూట్ మిగిలిపోయింది. దీన్ని త్వరలో పూర్తి చేసేందుకు బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్స్ వండర్ గా నిలుస్తుందని అంతా చెప్తున్నారు.

అటు యూట్యూబ్ లో కూడా సినిమా ట్రైలర్ రికార్డులను నమోదు చేసుకుంటోంది. నలబై మిలియన్లకు పైగా నెటిజన్లు ఐ సినిమా ట్రైలర్ ను చూశారు. ఇంత భారీ స్థాయిలో యూ ట్యూబ్ లో చూసిన తమిళ వీడియో ఇదే కావటం విశేషం. శంకర్ దర్శకుడుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాణంలో వస్తోంది. విక్రమ్ హీరోగా, అమీజాక్సన్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఇక ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో పాటలు హిట్ కావటంతో.. తెలుగులో కూడా మంచి స్పందన వస్తోందని ఆశిస్తున్నారు. ‘ఐ’ టీం భావిస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  telugu songs  i trailor  latest news  

Other Articles