Rakul preet singh enjoys day and night shooting

rakul preet singh, rakul preet singh hot, rakul preet singh latest, rakul preet singh photos, rakul preet singh wiki, rakul preet singh family, rakul preet singh latest hot photos, tollywood, latest news, bollywood, telugu movies, hyderabad, movies, interview, interview technics

rakul preet singh says she is enjoying day and night shooting : over night star heroine rakul preet singh reveal her shooting secrets and other details

నా రొమాన్స్ చాలా బాగుంటుంది

Posted: 09/20/2014 04:29 PM IST
Rakul preet singh enjoys day and night shooting

ఒకే సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించకున్న అమ్మడు మన రకుల్ ప్రీత్ సింగ్. తొలి సినిమాలో ట్రైన్ మిస్ చేసుకున్నా.. సినిమా లైఫ్ లో మాత్రం ఏమి మిస్ చేసుకోకుండా జాగ్రత్త పడుతోంది. త్వరలో విడుదల కానున్న ‘లౌక్యం’ సినిమాపై మీడియాతో ముద్దుగుమ్మ ముచ్చటించింది. ఈ సందర్బంగా వారు అడిగిన ప్రశ్నలకు తడబడకుండా.., ఏమి దాచుకోకుండా అన్ని విప్పి చెప్పేసింది. ఆఫర్లు ఎలా వచ్చాయి..  భవిష్యత్తులో ఉన్న సినిమాలేమిటి? ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిందనుకోండి. సినిమా షూటింగ్ సమయంలో బిజీ షెడ్యూల్ ఉన్నపుడు ఉదయం, రాత్రి షూటింగ్ చేసినా.., తాను ఒత్తిడి ఫీల్ అవకుండా, పనిని ఎంజాయ్ చేసినట్లు చెప్పింది.

తాజా ‘లౌక్యం’ విషయానికి వస్తే... తొలి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత కొద్ది కాలం ఖాళీగా ఉండగా.. దర్శకుడు శ్రీవాస్ పిలిచి ఇచ్చాడట. ఇందులో ఓ డాన్ చెల్లి పాత్రలో నటించినట్లు చెప్పింది. తన కామెడి, రొమాన్స్ కూడా బాగుంటుందని చెప్పింది. ఇక శ్రీవాస్ తనకు ఏం కావాలో క్లారిటి ఉన్న దర్శకుడు అని., తనతో పాటు అందరి నుంచి నటనను వివరించి మరీ రాబట్టుకున్నాడని పేర్కొంది. గోపిచంద్ గురించి చెప్పాలంటే, చాలా సంతోషంగా ఉంటూ సెట్ లో అందరితో కలిసిపోతాడని పొగిడేసింది. ‘లౌక్యం’లో ఇద్దరి మద్య ఉండే సీన్లు చాలా బాగా నవ్విస్తాయట.

మొదటి అవకాశంలో డాన్స్ చూపించే అవకాశం రాలేదని బాధపడుతుండగా., ఈ సినిమాలో డాన్స్ ఇరగదీసిందట. ప్రేక్షకులు తన నటన, నృత్యం చూసి ఎలా స్పందిస్తారా అని చాలా అతృతగా ఎదురుచూస్తోందని మీడియాతో చెప్పింది. అటు ఒక్క సినిమా హిట్ తో వరుసగా ఆఫర్లు రావటంతో ఉదయం ఒక సినిమా..,రాత్రి మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పింది. కష్టపడి పనిచేయటంతో పాటు ఇష్టపడి పనిచేస్తే శ్రమ అన్పించదు అని సూక్తి కూడా వివరించింది. అటు హింది సినిమాలొ కూడా ఈ అమ్మడు నటిస్తోంది. తనకు రెండు ఇండస్ర్టీలు రెండు కళ్ళలాంటివని రాజకీయ సిద్ధాంతం ఉపయోగించి తప్పించుకుంది. ఇలా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చి.. తన సినిమాను ఆశీర్వదించమని ప్రేక్షకులను కోరింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh  tollywood  interview  latest news  

Other Articles