South indian actress bhavana cheated by her boyfriend malayalam actor anoop menon

actress bhavana, bhavana latest news, bhavana hot photo shoot, bhavana news, bhavana anoop menon, bhavana boyfriend anoop menon, anoop menon with bhavana, bhavana with anoop menon, kollywood news, tollywood news, mollywood news

south indian actress bhavana cheated by her boyfriend malayalam actor anoop menon

బాయ్ ఫ్రెండ్ చేతిలో నిండా మోసపోయిన భావన!

Posted: 09/26/2014 04:58 PM IST
South indian actress bhavana cheated by her boyfriend malayalam actor anoop menon


సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం... తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవడం ఈమధ్య సర్వాసాధారణం! కానీ ఇక్కడ భావన విషయంలో మాత్రం ఇదో పెద్ద షాకింగ్ న్యూసేనని చెప్పాలి. తన బాయ్ ఫ్రెండ్ తో పీకల్లోతూ ప్రేమలో పడిపోయి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆమెను మోసం చేసేశాడు. వీరి మధ్య ఎటువంటి విభేదాలు వచ్చాయో తెలియదు కానీ... సడెన్ గా అతడు మాత్రం నటి భావనకు బైబై చెప్పేసి, వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దీంతో ఈ విషయం తెలిసుకున్న భావన ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.

సౌత్ ఇండస్ట్రీలో వున్న చిత్రపరిశ్రమలన్నింటిలోనూ సినిమాలు చేసుకుంటూ సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తున్న మలయాళీ కుట్టి భావనకు అనుకోకుండా ఓ సందర్భంలో మలయాళ నటుడు అనూప్ మీనన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. దీంతో వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాయనే ప్రచారాలు బాగానే కొనసాగాయి. వారిద్దరు ఈ ప్రచారాలకు విరుద్ధంగా ఏనాడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో వాళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదు కానీ.. నటుడు అనూప్ మీనన్ అనూహ్యంగా ఒక షాకింగ్ ప్రకటనను విడుదల చేశాడు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించిన ఆయన.. తనకు కాబోయే భార్య మాత్రం చిత్రపరిశ్రమకు చెందింది కాదని పేర్కొన్నారు.

35ఏళ్ల ఈ మలయాళ నటుడు తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. తన పెళ్లి విషయాన్ని బయటపెట్టేశాడు. అలాగే.. తాను 26 ఏళ్ల వయస్సులో సినీ రంగప్రవేశం చేశానని పేర్కొన్న ఆయన ఇప్పటివరకు పది చిత్రాలకు కథలు అందించినట్లు పేర్కొన్నారు. సినిమాలతో బిజీగా వుండటం వల్ల వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయానని పేర్కొన్నాడు. అందుకే ఇప్పుడు ఆ మిస్ అయిన వాటన్నింటిని తిరిగి పొందడానికి వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపాడు. అయితే తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి వివరాలు పూర్తిగా విశ్లేషించలేదు కానీ.. అమ్మాయి మాత్రం చిత్రపరిశ్రమకు చెందింది కాదంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో ఇన్నాళ్లవరకు అతనిమీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న భావన ఆశలు పూర్తిగా అడియాశలైనట్లు తెలుస్తోంది.

నిజానికి భావనకు సంబంధించిన ప్రేమవ్యవహారాలు అంతగా బయటకు రాలేదు. ఆమె ఇంతకుముందు హీరోలతోగానీ, ఇతర సెలబ్రిటీలతోగానీ ప్రేమించినట్లు దాఖలాలు అయితే అస్సలు లేవు. కానీ ఈ మలయాళ నటుడు అనూప్ మీనన్ ఒక్కడితో మాత్రమే చాలా సన్నిహితంగా మెలిగేది. ఏదో ఒక చిత్రం షూటింగ్ సందర్భంగా కలిసిన వీళ్లు.. అప్పటినుంచి డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. వీలు కుదిరినప్పుడల్లా సినిమాలు, షికార్లు, పబ్బులు వంటి వాటికి బాగానే చక్కర్లు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనూప్ ఇచ్చిన స్టేట్ మెంట్ సినీ జనాలతోపాటు మీడియా వర్గాలను కూడా తికమకలో పెట్టేసింది. నిన్నమొన్నటివరకు భానవతోనే అతడు పెళ్లి చేసుకుంటాడని ఫిక్స్ అయిన నేపథ్యంలో అతని ఇచ్చిన షాకింగ్ స్టేట్ మెంట్ కోలుకోలేకపోతున్నారు. మరి ఈ విషయంపై భావన ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles