Bollywood actress geetanjali thapa is ready to do movies in any languages

geetanjali thapa, geetanjali thapa latest news, liar's dice movie, liar's dice oscar entry, geetanjali thapa emraan hashmi, geetanjali thapa emraan hashmi tigers movie

bollywood actress geetanjali thapa is ready to do movies in any languages and also in hot movies

సినిమా ఆఫర్ ఇస్తే ఈమెను వాడుకోవచ్చట!

Posted: 09/26/2014 06:22 PM IST
Bollywood actress geetanjali thapa is ready to do movies in any languages

సాధారణంగా చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోదామనుకుని చిన్న సినిమాల తారలు దేనికైనా తెగించడానికి రెడీ అంటుంటారు. ఎక్స్ పోజింగ్ నుంచి బెడ్ రూమ్ సన్నివేశాల వరకు నటించడానికి నిర్మొహమాటం లేకుండా అంగీకరిస్తారు. ఒకవేళ అటువంటివారికి అదృష్టం కలిసి వస్తే స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతారు... లేకపోతే అటువంటి సినిమాలే చేసుకోవాల్సి వస్తుంది. ఇదిలావుండగా.. తాజాగా ఒక బాలీవుడ్ తార ‘‘తనకు ఎవరైనా సినిమాల్లో నటించే అవకాశం ఇస్తే చాలు.. తనను ఫుల్లుగా వాడుకోవచ్చు’’ అనే రీతిలో స్టేట్ మెంట్లు ఇస్తోంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు.. ఇటీవల బాలీవుడ్ లో రిలీజై ఆస్కార్ ఎంట్రీగా ఎంపికైన ‘‘లయర్స్ డైస్’’ మూవీ తార గీతాంజలి!

ఇంతకు అసలు విషయం ఏమిటంటే.. గీతాంజలి నటించిన లయర్స్ డైస్ చిత్రం ఆస్కార్ కు ఎంపికైన నేపథ్యంలో ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలు అందుకున్న ఆ మూవీలో ముఖ్య భూమిక పోషించిన గీతాంజలి చాలా అద్భుతంగా నటించిందని బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ చిత్రంలో గిరిజన యువతి కమల పాత్రలో నటించి, అందర్నీ ఆకట్టుకున్న గీతాంజలి.. ఉత్తమ నటి అవార్డునూ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు అందరూ ఆ సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు గీతాంజలి నటన గురించి చెప్పుకుంటున్నారు. తన సినిమా ఆస్కార్ కు నామినేట్ అవడంతోపాటు జాతీయ అవార్డును అందుకున్న గీతాంజలి సంతోషం వ్యక్తం చేస్తూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను వ్యక్తపరిచింది.

‘‘వాణిజ్య చిత్రం.. కళాత్మక చిత్రం.. నా దృష్టిలో ఈ రెండింటికీ ఎటువంటి భేదం లేదు. ఎందులో అయినా వుండేది కథ, పాత్రలే. అయినా కథకు తగ్గట్టు పాత్రకు న్యాయం చేయడమే నటుల పని’’ అని అంటోంది గీతాంజలి తాప. అంటే.. ఆమె దగ్గరకు విలువున్న పాత్రతోపాటు మంచి కథాంశాలు వున్న స్ర్కిప్ట్ లు తీసుకెళ్తే.. ఏ భాషలోనైనా నటించడానికి రెడీ అంటోంది. తనలో వున్న నటనా ప్రతిభను ఫుల్లుగా వాడుకోవచ్చునంటూ ఆమె దర్శకనిర్మాతలకు ఆఫర్ ఇస్తోందన్నమాట! అలాగే లయర్స్ డైస్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘‘లయర్స్ డైస్ చిత్రం ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక కావడం ఎంతో గౌరవించదగిన అంశం. ఇంతవరకు ఈ సినిమాను కొంతమంది మాత్రమే వీక్షించి వుంటారు.. కానీ ఇప్పుడు ప్రతిఒక్కరు చూసే వీలుంది. మనసు, భావోద్వేగాలే ఓ మంచి సినిమా రూపొందడానికి కారణం అవుతాయి’’ అంటూ హితువులు పలుకుతోంది.

అలాగే మసాలా సినిమాల గురించి మాట్లాడుతూ.. సదరు హాట్ సన్నివేశాలున్న చిత్రాల్లో కూడా మంచి పాత్ర లభిస్తే చేస్తానని కూడా చెబుతోంది. సాధారణ చిత్రాలతోపాటు మసాలా చిత్రాలు కూడా ఎన్నో మార్పులు చేకూరుస్తాయని పేర్కొంటోంది. అంటే పరోక్షంగా ఈ అమ్మడు మసాలా సినిమాల్లోనూ నటించడానికి సై అంటోందన్నమాట! మంచి సినిమాలో ఒక భాగం కావాలని కోరుకుంటున్న ఈమె.. ఏ భాషలో నటించడానికైనా సిద్ధమేనని చెబుతోంది. మరోవైపు ఈ అమ్మడు ఇమ్రాన్ హష్మీతో ‘‘టైగర్స్’’ అనే సినిమాలో బాగానే మసాలా పండించిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : geetanjali thapa  emraan hashmi  liar's dice movie  bollywood tigers movie  

Other Articles