మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు అన్ని కొత్త, వింత ఇబ్బందులు వస్తున్నాయి. ఇన్నాళ్లు సరైన కధ దొరకటం లేదు అని మెగా ఫ్యామిలి తెగ ఆరాట పడింది. అయితే ఎలాగోలా కధ ఒకే అయ్యింది. ఒకటి కాదు ఏకంగా మూడు కధలు పట్టుకుని కూర్చున్నారు. కానీ ఏం లాభం సినిమాను చేసేందుకు డైరెక్టర్ సిద్ధంగా లేడు. ఈ సినిమా కధ ఏమిటో బయటకు చెప్పటం లేదు కానీ.., కధలకు తగ్గ డైరెక్టర్ తగలటం లేదబ్బా అని చరణ్ తెగ ఫీల్ అవుతున్నాడు. ‘నాన్నకు తగినట్లు మూడు కధలు సిద్దం చేసుకున్నాము. వాటిని పరిశీలించి ఓకే చెప్పాము కూడా. కాని డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా నిర్ణయించలేదు’ అని అన్నాడు.
హీరోగా పలు సినిమాలు చేసి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న చెర్రీ.., తండ్రి 150వ సినిమాను తల్లి పేరుతో స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ వ్యవహారాలను స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. కథ వినటం, డైరెక్టర్ల ఎంపిక ఇతరత్రా అంశాలన్నీతాను పరిశీలిస్తున్నాడు. తండ్రి పట్ల అంత జాగ్రత్తలు తీసుకుంటున్న రామ్ మెచ్చిన కధలకు ఇంతవరకు ఎవరూ సరైన డైరెక్టర్ అన్పించలేదట. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే చిరు సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియటం లేదు. దీనికి రెండు అంశాలు ఉన్నాయి. డైరెక్టర్లు ఎప్పుడు ఖాళీగా ఉంటారో తెలియక సినిమా తెరకెక్కటం ఆలస్యం అవుతుంది. రెండవది మెగా ఫ్యామిలి ఎప్పుడు సినిమా తీస్తుందో తెలియక డైరెక్టర్లు ఎవ్వరూ రావటం లేదని టాక్ వస్తోంది.
ఇక మొదటిది పరిశీలిస్తే.., మెగాస్టార్ 150వ సినిమా అంటే ఆషామాషి కాదని అంతా అనుకుంటున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే మెగా ఫ్యామిలి కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలువురు రచయితలు, డైరెక్టర్లతో అనేక కధలను పరిశీలించి చివరగా ఓ మూడు ఎంపిక చేసింది. అయితే ఈ కధలు తీయాలంటే మామూలు డైరెక్టర్లు, కొత్తవారు సరిపోరు కాబట్టి పెద్ద దర్శకులు అయితేనే బాగుటుంది అని అనుకుంటున్నారు. ఇక్కడే వారికి సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ డైరెక్టర్లుగా పేరున్న రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాధ్, బోయపాటి శ్రీను వంటి వారు ఖాళీగా లేరు. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంకో ఆరేడు నెలల వరకు ఎవరిని కదపలేము. ఇక మిగిలింది. కృష్ణవంశీ, వి.వి. వినాయక్, శ్రీనువైట్ల అని చెప్పవచ్చు. ఈ ముగ్గురిలో కధల పరంగా ఎవరికి వారే సాటి. వినాయక్ మెసేజ్ ఓరియంటెడ్ భారీ బడ్జెట్ సినిమాలు బాగా చేయగలడన్న పేరు ఉంది. ఇక కృష్ణవంశీ అయితే ఫ్యామిలీ కధలను కళ్లకు కట్టేలా చూపగలడు, శ్రీనువైట్ల విషయానికి వస్తే కావాల్సినదానికంటే కాస్త ఎక్కువే కామెడిని ఇచ్చి ప్రేక్షకులను నవ్వించి లాభపడతాడని అంతా అంటారు.
గత సినిమాలను బట్టి చూస్తే.. చిరంజీవి ఇప్పుడు ఫ్యామిలి ఓరియంటెడ్ సినిమాలు చేయడని టాక్ వస్తోంది. కాబట్టి కృష్ణవంశీకి అవకాశం తక్కువ. ఇకపోతే శ్రీనువైట్ల గతంలో చేసిన ‘అందరివాడు’ విమర్శలను తీసుకొచ్చింది. తట్టుకోలేని కామెడితో చిరుకు కూడా కోపం తెప్పించింది. దీనికి తోడు ఈ మద్య వచ్చిన ‘ఆగడు’ అంతగా ఆదరణ పొందలేదు. ఇకపోతే రామ్ చరణ్ తో కొత్త సినిమా అవకాశం కూడా అంతంతమాత్రమే. కాబట్టి వైట్ల కూడా అవుట్ అని చెప్పవచ్చు. ఇక వి.వి.వినాయక్ విషయానికి వస్తే.., గతంలో చిరుతో పలు హిట్ సినిమాలు తీసిన పేరుంది. అయితే ఈ మద్య వచ్చిన ‘అల్లుడు శీను’ ఆడలేదు. దీనిపై నిర్మాత బెల్లంకొండ సురేష్ బాగా నష్టపోయాడు. ఈ పరిస్థితుల్లో సినిమాను అప్పగిస్తే రిజల్ట్ ఏమిటి? అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దీంతో ఆయనకు కూడా అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చు.
ఉన్నవారిలో లోపాలు వెతుకుతున్నారు. మిగతావారు బిజీగా ఉన్నామంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో చిరంజీవి 150వ సినిమా కోరిక తీరేదెప్పుడో చూడాలి. కధను తెరకెక్కించే ఘనత ఏ దర్శకుడికి వస్తుందో. లేక వీరందరినీ కాదని తమిళం, బాలీవుడ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్లను పిలిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఎవరో ఒకరు వచ్చి సినిమాను తీస్తే.. త్వరగా చూడాలని మెగా ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. వారి కోరిక తీరెదెప్పుడో చరణే చెప్పాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ....
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more