కొత్త సినిమాలపై సంచలనాల డైరెక్టర్ వి.వి వినాయక్ నోరు విప్పారు. 2015 సంవత్సరంలో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరిద్దరితో వచ్చే ఏడాదిలో సినిమాలు చేస్తానన్నారు. మిగతా ప్రాజెక్టులు ఇంకా ఓకే కాలేదని ప్రస్తుతం చర్చల దశలో కొన్ని ఉన్నాయని చెప్పారు. విశాఖ జిల్లా నక్కపల్లకి వచ్చిన సందర్బంగా స్థానికంగా మీడియాతో వివి మాట్లాడారు.
వీరిద్దరితోనే కాకుండా మరో ఇద్దరు పెద్ద హీరోలతో రెండు సినిమాలు చేస్తానన్నారు. అయితే వారి పేర్లు వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ఎన్టీఆర్ తో కామెడి ఎంటర్ టైనర్ గా నిలిచిన ‘అదుర్స్’ సినిమాను తీసుకుని ‘అదుర్స్ 2’ చేస్తానని చెప్పారు. దీనికోసం కధను కూడా సిద్దం చేశానన్నారు. ఇక చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి కధ విషయంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. అయితే ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలపై ఇప్పుడే ఏమి స్పందించలేమన్నారు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి.వి. వినాయక్ ఈ మద్య సినిమాలు తీయటం కాస్త తగ్గించారు. ఇటీవలే ఆయన డైరెక్ట్ చేసిన ‘అల్లుడు శీను’ విడుదల అయింది. అయితే అది పెద్దగా హిట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం చిరు 150వ సినిమా చేయాలని భావిస్తున్నారు. మెగా టీం దగ్గర ఉన్న దర్శకుల లిస్ట్ లో వివి ముందు వరుసలో ఉన్నట్లు టాక్ విన్పిస్తోంది. మహేష్ ఇప్పటికే ఒక డైరెక్టర్ తో సినిమా ఓకే చెప్పటంతో అది పూర్తయితే వినాయక్ తో సినిమా తీసే అవకాశముంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more