Balakrishna song with trisha

balakrishna, balakrishna wiki, balakrishna latest, balakrishna movies, balakrishna upcoming movies, balakrishna family, balakrishna son, balakrishna family, balakrishna movies list, trisha, trisha hot, trisha latest, trisha with rana, trisha dating, trisha wine, trishain mumbai, trisha photos, trisha marriage, trisha krishnan, trisha facebook, latest news, tollywood, legend, telugu upcoming movies new movies

legend star balakrishna danced with trisha in a song in his new movie which is going to release soon : balakrishna and trisha dance in his latest movie on a song named haisa ambani pilla

అంబాని కోసం త్రిషను పట్టుకున్న బాలయ్య

Posted: 10/01/2014 12:22 PM IST
Balakrishna song with trisha

నందమూరి నటరత్న బాలకృష్ణ ఇప్పుడు అంబాని పాట పాడుతున్నాడు. అదేమంటే ఆయన హీరోగా వస్తున్న కొత్త సినిమాలో ‘హైసా అంబానీ పిల్లా’ అని ఓ పాట ఉంది. ఈ పాటలో బాలయ్య త్రిషతో కలిసి డాన్స్ చేశాడట. ఫిలింసిటిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నందమూరి మంచి స్టెప్పులతో అదరగొట్టాడని సినిమా యూనిట్ అంటోంది. నోబుల్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాటకు సంబంధించి సెట్ కూడా బాగుందని అంటున్నారు. బాలయ్యకు గతంలో పలు మ్యూజికల్ హిట్లను అందించిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

బాలకృష్ణకు తగ్గట్టు బాణిలు చేయటంలో మణిశర్మకు మంచి పేరు ఉంది. దీంతో ఈ సినిమాలో కూడా పాటలు హైలైట్ అవుతాయని తెలుస్తోంది. సత్యదేవ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పేలా బాలకృష్ణ పాత్ర ఉంటుందని డైరెక్టర్ సత్యదేవ వెల్లడించాడు. త్వరలోనే ఫిలింసిటిలో సినిమా షూటింగ్ పూర్తవుతుందన్నాడు. ఇక ఈ మూవీకి నిర్మాతగా ఉన్న రమణారావు.., ప్రేక్షకులు బాలకృష్ణ నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు.

‘లెజెండ్’ హిట్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఇదే. దీంతో గత సినిమాను మించేలా ఇందులో డైలాగులు, యాక్షన్ సీన్లు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. అటు ప్రేక్షకులు కోరుకునే ప్రతి అంశాన్ని ఇచ్చేందుకు ఇష్టపడే బాలకృష్న వారికోసం రిస్క్ చేయటానికి ఇబ్బంది పడడు అని పేరుంది. మరి ఈ సినిమాలో సింహం ఫైట్లు, డాన్స్, డైలాగులు ఎలా ఉన్నాయో చూడాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  balakrishna  latest news  movies  

Other Articles