Court rejected swetha basu mother plea

swetha basu prasad, swetha basu prasad wiki, swetha basu prasad arrest, swetha basu prasad prostitution, swetha basu prasad laetst, swetha basu prasad in jail, swetha basu prasad latest updates, swetha basu prasad case, swetha basu prasad business man, business man with swetha basu prasad, heroines, telugu heroines, hot photos, swetha basu prasad hot photos, latest news, tollywood, court, prostitution case

erramanzil court rejected actress swetha basu prasad mother pitition to release her and allow to take back to home : court orders to continue rehabilitation as of before order by rejecting swetha basu mother plea

పాపం.. శ్వేతను కరుణించని కోర్టు

Posted: 10/01/2014 11:30 AM IST
Court rejected swetha basu mother plea

వ్యభిచారం కేసులో అరెస్టయిన నటి శ్వేత బసు ప్రసాద్ కు కోర్టులో ఊరట లభించలేదు. శ్వేతను విడుదల చేసేందుకు కోర్టు నిరాకరించింది. తన కూతురును ఇంటికి తీసుకు వెళ్లేందుకు అనుమతించాలంటూ నటి తల్లి దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. సోమవారం శ్వేత తల్లి పిటిషన్ పై విచారణ జరిపిన ఎర్రమంజిల్ కోర్టు.., ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను విడుదల చేయలేమన్నట్లు చెప్పింది. పదిహేను రోజుల పాటు రెస్య్కూ హోంలో ఉంచాలన్న గత తీర్పుకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేసింది. దీంతో శ్వేత మరికొన్ని రోజులు అక్కడే ఉండక తప్పదు.

అటు రెస్య్కూ హోం లో గడువు పూర్తయిన తర్వాత కోర్టు ఎలా వ్యవహరిస్తుంది అనే విషయంపై ప్రస్తుతం శ్వేత కుటుంబం ఆందోళన చెందుతోంది. రిహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచాలంటూ గడువు పొడగిస్తుందా.., లేక కౌన్సిలింగ్ ఇప్పించి ఇంటికి పంపించాలని ఆదేశిస్తుందా? అనేది తెలియక ఆందోళన చెందుతున్నారు. గడువు పూర్తి కాగానే ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించాలని మరోసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. వ్యభిచార కేసులో పట్టుబడ్డ యువతులు, మహిళలను తిరిగి వారి ఇంటికి పంపాలంటే రెస్య్యూ హోం ప్రతినిధులు బాధితురాలి కుటుంబ పరిస్థితులపై అద్యయనం చేసి కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా కుటుంబ పరిస్థితి బాగుందని తెలిస్తే విడుదల చేసేందకు కోర్టు అంగీకరిస్తుంది. లేకపోతే రెస్క్యూ హోం లోనే కొనసాగించాలని స్పష్టం చేస్తుంది.

ఇక ఈ వ్యవహారంలో మీడియాతో పాటు పోలిసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కుటుంబ పరిస్థితులు, అవకాశాలు లేకపోవటంతో వ్యబిచార కూపంలోకి దిగిన శ్వేతను అరెస్టు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న పోలిసులు ఆమె వెంట పట్టుబడ్డ బిజినెస్ మెన్ ఎవరనేది మాత్రం బయటకు చెప్పటం లేదు. బాధితురాలిని సమాజానికి చూపిస్తున్న ఖాఖీలు.., ఆమెను వాడుకోవాలని చూసిన వ్యక్తిని మాత్రం దాచిపెడుతున్నారని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అటు సినీ ప్రముఖులు మీడియాపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రతి విషయాన్ని పెద్దది చేసి లేనిపోని టెన్షన్ క్రియేట్ చేసే మీడియా.., శ్వేతను హైలైట్ చేసి వెనక ఉన్న నిందితుడిని మాత్రం కవర్ చేయటం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి శ్వేత అవసరాన్ని అవకాశంగా వాడుకున్న వ్యక్తి ఎవరో..,, ఎప్పుడు బయటకు వస్తాడో...?


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swetha basu prasad  sweta basu prasad  latest news  court  

Other Articles