ఇటీవలే వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడిన యువనాయిక శ్వేతబసు.. ప్రస్తుతం రెస్క్యూ హోంలో వున్న సంగతి తెలిసిందే! అయితే ఇంతవరకు పోలీసులు ఆమెతోపాటు పట్టుబడిన బిజినెస్ మేన్ పేరుగానీ, ఇతరుల పేర్లుగానీ తెరమీదకు తీసుకురాలేదు కానీ... రిమాండ్ లో శ్వేతను కూర్చోబెట్టి బాగానే నాన్చుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఆమెను ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. వారు అడిగిన ప్రశ్నల నేపథ్యంలో శ్వేత కొన్ని ఊహించని సమాధానాలు చెబుతోందని.. ఆమె వ్యవహారం చూస్తుంటే కేసును మొత్తం పక్కదోవ పట్టిస్తున్నట్లుగా వుందని కొంతమంది వాదిస్తున్నారు. శ్వేతబసు చెప్పిన సమాధానాల్లో అంత క్లారిటీ లేదని చెబుతున్నారు.
మొదట అడిగిన ప్రశ్నలకు ఆమె సరిగ్గానే సమాధానాలు చెప్పింది. అదేమిటంటే.. వ్యభిచారంలో పట్టుబడిన రోజు అసలు స్టార్ హోటల్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? అని అడిగిన ప్రశ్నకు ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. సంతోషం అవార్డు వేడుకల ఆర్గనైజర్స్ పిలవడంతో తాను ఆ హోటల్ కు వెళ్లాల్సి వచ్చిందని.. తనకోసం అక్కడే ఒక రూమ్ ని బుక్ చేశారని ఆమె చెప్పినట్లు తెలిసింది. అలా కొనసాగుతున్న ఈ ప్రశ్నోత్తరాల నేపథ్యంలో ఈ అమ్మడు తానింకా గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్నానని.. ఇంకా తను విద్యార్థినేనంటూ చెప్పిందట! అలాగే తనను ఎవరో కావాలనే ఈ వ్యభిచారంలోకి లాగారని, అసలు ఆరోజు ఏం జరిగిందో తనక్కూడా పూర్తిగా తెలియదని చెప్పినట్లు సమాచారం! అంటే.. తాను కేవలం ఒక గొర్రె అని, అనవసరంగా తనను బలి చేశారని తన ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా.. శ్వేత ఇచ్చిన సమాధానం మేరకు పోలీసులు సంతోషం అవార్డు ఆర్గనైజర్లను కూడా విచారించే అవకాశాలు వున్నాయి. ఆ విచారణలో భాగంగా మరికొన్ని నిజానిజాలు బయటపడే ఛాన్స్ వుండొచ్చు.
ఇదిలావుండగా.. శ్వేత ఇక్కడ గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్నానని సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతగా చదువు మీద ధ్యాసే వుంటే.. గతంలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా డైరెక్ట్ గా వ్యభిచారం గురించి మాట్లాడి దొరికిపోయి.. ఇప్పుడు ఏమి తెలియని అమాయకురాలిగా నటించడం విచిత్రంగా వుందని అంటున్నారు. శ్వేత ఈ కేసు విషయంలో సరిగ్గా సమాధానాలివ్వకుండా ఆమె స్వయంగా తప్పుదోవ పట్టిస్తున్నట్లు కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్వేత ఈ విధంగా నటించడం వెనుక ఎవరో హస్తం వుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాకాకుండా శ్వేత సరియైన సమాధానాలతో సహకరిస్తే తనకే మంచిదని సలహాలు ఇస్తున్నారు. రానురాను ఈ వ్యభిచార కేసు వ్యవహారం ఇంకెన్నాళ్లవరకు సాగుతుందోనని అందరూ అనుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more