Mahesh babu koratala siva movie schedules details

mahesh babu, tollywood news, tollywood mahesh babu, mahesh babu aagadu movie, aagadu movie news, aagadu movie collections, aagadu movie mahesh babu, director koratala siva, mahesh babu koratala siva, koratala siva news

mahesh babu koratala siva movie schedules details : tollywood prince mahesh babu latest movie with director koratala siva shooting schedule postponed due to holidays

టాలీవుడ్ ఇచ్చిన షాక్ తో వెనక్కివెళ్లిన ప్రిన్స్!

Posted: 10/11/2014 11:34 AM IST
Mahesh babu koratala siva movie schedules details

ప్రిన్స్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో అందరికీ తెలిసిందే! ఇంతవరకు అతను నటించిన దాదాపు సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించినవే! ఒకవేళ ఇతని సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం బాగానే వసూలవుతాయి. అలాగే ప్రిన్స్ తో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తే ఎటువంటి నష్టం వాటిల్లదనే నమ్మకంతో నిర్మాతలు ఎంత ఖర్చు చేయడానికైనా ముందుకు వస్తారు. బయ్యర్లు కూడా ప్రిన్స్ మీదున్న నమ్మకంతో ఎక్కువ డబ్బులు వెచ్చించి రైట్స్ ను కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు ఇతను నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడంతో నిర్మాతలు, బయ్యర్లు మంచి లాభాలను రాబట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ‘‘ఆగడు’’ సినిమా నిర్మాతలు - బయ్యర్లను భారీగా నష్టం కలిగించడంతోపాటు పిన్స్ కు కూడా పెద్ద షాక్ కు గురిచేసేసింది.

ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘‘ఆగడు’’ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన విషయం అందరికీ విదితమే! ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతుందని విడుదలకు ముందు భారీ పబ్లిసిటీ ఇచ్చుకున్న నిర్మాతలకు.. బాక్స్ బద్దలైపోయింది. కలెక్షన్లు సరిగ్గా వసూళ్లు కాకపోవడంతో నిర్మాతలు రోడ్డున పడ్డారు. అయితే మహేష్ తన మంచి హృదయంతో ఆగమైన నిర్మాతలను ఆదుకున్నాడు కానీ.. అతడు మాత్రం డేంజర్ జోన్ లో పడిపోయాడనే భయంతో తీవ్ర అసంతృప్తితో వున్నాడట! ఊహించని విధంగా ‘‘ఆగడు’’ పెద్ద ఫ్లాప్ కావడంతో మహేష్ తీవ్ర ఆలోచనల్లో పడిపోయాడట! ఎంతగా అంటే.. ఇకనుంచి సినిమాలు తీయాలా..? వద్దా..? అనే డైలామాలో మునిగిపోయాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ‘‘ఆగడు’’ సినిమాకు టాలీవుడ్ ఇచ్చిన పెద్ద షాక్ నుంచి మహేష్ బాబు ఇంకా తేరుకోలేకపోతున్నాడని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అందుకే.. మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా వెనక్కు వెళ్లిపోయాడని అనుకుంటున్నారు.

‘‘ఆగడు’’ తర్వాత ప్రిన్స్ తన తరువాతి ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో ఒప్పుకున్నట్లుగా ఇదివరకే అందరికీ తెలిసిన విషయం! ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి, ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకోవాల్సింది. అయితే అలా కాకుండా ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 24 నుంచి రెగ్యులర్ గా జరుపుకుంటుందని సమాచారం! అయితే ప్రిన్స్ మాత్రం నవంబర్ 3వ తేదీ నుంచి సెట్స్ కి హాజరవుతాడని ఆ మూవీ యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం మహేష్ హాలిడేలో వుండటం వల్లే సెట్స్ కు రావడం ఆలస్యం అవుతోందని చెప్పుకుంటున్నారు. అయితే సినీవిశ్లేషకుల ప్రకారం.. ఆగడు సినిమా భారీగా ఫ్లాప్ కావడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మహేష్.. ఆ బాధ నుంచి బయటపడటం కోసమే మూవీ షూటింగ్ ను వాయిదా వేసుకున్నాడని అంటున్నారు. అయితే అలాంటిదేమీలేదని, మహేష్ హాలిడేలో వుండటం వల్లే యూనిట్ మొత్తం విరామం తీసుకుంటోందని ఆ చిత్రవర్గాలు తెలుపుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఇటీవలే ‘‘మగాడు’’ అనే టైటిల్ ప్రచారం కొనసాగింది కానీ.. టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదని దర్శకుడు స్పష్టం చేశాడు. మైత్రి సంస్థ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు వెల్లడించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  koratala siva  tollywood news  tollywood actresses  

Other Articles