Producer bandla ganesh praises kajal agarwal in govindudu success meet

kajal agarwal, bandla ganesh, kajal agarwal hot photo shoot, kajal agarwal govindudu romance, kajal agarwal topless photos, producer bandla ganesh news, govindudu andari vadele movie, ram charan news

producer bandla ganesh praises kajal agarwal in govindudu success meet and mentioned her as his sister

కాజల్ పై కుండబద్ధలు కొట్టిన బండ్ల!

Posted: 10/11/2014 11:00 AM IST
Producer bandla ganesh praises kajal agarwal in govindudu success meet

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు మామూలు ఆర్టిస్టుగా పనిచేస్తూ వచ్చిన బండ్లగణేష్.. ప్రస్తుతం ఒక సొంత బ్యానర్ పెట్టుకుని భారీ చిత్రాలను నిర్మించే పెద్ద నిర్మాతల జాబితాలోకి చేరిపోయిన విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇతర నిర్మాతల కంటే బండ్ల గణేష్ వ్యవహారం చాలా వెరైటీగా వుంటుంది. తెరపై అతను ఏ విధంగా అయితే బాగానే నవ్విస్తాడో.. ఇప్పటికీ అలాగే స్టేజీలపై మైకులు పట్టుకుని తనదైన శైలిలో అందరినీ నవ్వించేస్తుంటాడు. అలాగే చిత్రపరిశ్రమలో వున్న బడాబాబులను, హీరోయిన్లను పొగడ్తలతో ముంచెస్తూ ఆకాశానికెత్తేస్తుంటాడు. ఇదివరకే పవన్, చిరంజీవిలను దేవుళ్లంటూ పొగిడేసిన ఈ నిర్మాత... తాజాగా రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ లపై అటువంటి పొగడ్తలనే సంధించి అందరినీ నవ్వించేశాడు.

ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ మూవీ నిర్మాత బండ్లగణేష్ విజయోత్సవ వేడుకను నిర్వహించాడు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో బండ్ల గణేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయాడు. ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరుకాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులను తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ను ఈ నిర్మాత ‘‘రామ్ నా లిటిల్ బాస్’’ అంటూ ఆకాశానికెత్తేశాడు. అలాగే అప్పుడస్పుడు జోకులు వేస్తూ ఎంటర్టైన్ చేశాడు. దీంతో అక్కడున్నఅభిమానులందరూ బాగానే ఎంజాయ్ చేశారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. కాజల్ పై కూడా నిర్మాత బండ్ల కుండబద్ధలు కొట్టేశాడు. కాజల్ పై బండ్ల చేసిన కామెంట్స్ విని.. అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా నవ్వేసుకున్నారు!

అదేమిటంటే.. స్టేజిపై బండ్ల, కాజల్ గురించి మాట్లాడుతూ.. ‘‘కాజల్ నా సొంత చెల్లెలు’’ అంటూ పైకి లేపేశాడు. ఈ మాటలతో కాజల్ ఎలా రియాక్ట్ అయ్యిందో తెలీదు కానీ.. వేడుకలో వున్న ప్రతిఒక్కరూ తమ నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయారు. అలాగే ఈ సినిమాలో రామ్, కాజల్ బావామరదళ్లుగా బాగా నటించారని.. అందుకే ఈ సినిమా పెద్ద విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఇప్పటివరకు బండ్ల నిర్మించిన సినిమాలలో కాజల్ అగర్వాల్ ఒక్కతే వరసగా నటిస్తోంది. బాద్ షా, గోవిందుడు తదితర సినిమాల్లో ఆడిపాడిన ఈ సెక్సీ తార.. బండ్ల నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. అందుకే ఆ పంజాబీ ముద్దుగుమ్మను బండ్ల ఆకాశానికెత్తేస్తున్నాడని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bandla ganesh  kajal agarwal  ram charan  govindudu andari vadele  tollywood  telugu news  

Other Articles