Kota srinivas rao settairs on kajal agarwal

kota srinivas rao, kajal agarwal, kajal agarwal hot photo shoot, kajal agarwal govindudu andari vadele movie, kajal agarwal movie news, govindudu andari vadele success meet

kota srinivas rao settairs on kajal agarwal

కాజల్ అందాలపై సెటైర్లు వేసిన కోట!

Posted: 10/11/2014 06:55 PM IST
Kota srinivas rao settairs on kajal agarwal

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రస్తుత ఓ వెలుగు వెలుగుతున్న కాజల్ అగర్వాల్... ఎంత అందంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! శృంగారతారలా తెరపై కనువిందు చేస్తూ.. రసికులను రక్తికట్టించేస్తుంటుంది. అంతెందుకు.. ఆమెతో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని టాప్ హీరోలందరూ అనుకుంటుంటారు. ఇతరులకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చుకుని మరీ నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంటారు. అందుకు ఉదాహరణగా గోవిందుడు సినిమాను తీసుకోవచ్చు. ఇదివరకెన్నడూ ఎవ్వరూ తీసుకున్నంతగా 2 కోట్ల రెమ్యునరేషన్ ను కాజల్ ఈ సినిమాకు తీసుకుందని ఫిలింనగర్ లో వార్తలు కూడా వచ్చాయి. ఇక్కడే అర్థమైపోతుంది.. ఈ అమ్మడికి అందానికి ఎంత డిమాండ్ వుందో!

ఇదిలావుండగా.. టాలీవుడ్ లో విలన్ పాత్రల్లో నటించి నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న కోట శ్రీనివాసరావు.. ఒక మంచి వక్త కూడా! ఆయన తన ప్రసంగాల్లో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. అప్పుడప్పుడు ఇతరుల మీద సెటైర్లు వేస్తూ జోక్స్ వేస్తుంటారు. అయితే ఇలాగే ఆయన హీరోయిన్ కాజల్ అందాలపై సెటైర్లు వేస్తూ.. అవనసరంగా నోరు జారారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. శుక్రవారం హైదరాబాద్ లో ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సక్సెస్ మీట్ జరిగిన విషయం తెలిసిందే! ఈ వేడుకలో సినిమాకు సంబంధించి దాదాపు అందరూ నటీనటులు హాజరయ్యారు కానీ రామ్ చరణ్ మాత్రం ఇతర నగరంలో వుండటం వల్ల హాజరు కాలేదు. అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ప్రెస్ మీట్ ప్రారంభమైనప్పటికీ.. ఇంకా ఆమె వేడుకకు చేరుకోలేదు. దీంతో కోట ఆమెపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘హీరోయిన్లు అందాలు చూపించడానికే తప్ప, మాట్లాడటానికి రారు కదా! కాజల్ రాదులే’’ అని వ్యాఖ్యానించారు.

అయితే.. తర్వాత ప్రెస్ మీట్ జరుగుతుండగానే కాజల్ అగర్వాల్ హడావుడిగా అక్కడకు చేరుకుంది. ‘‘ప్రెస్ మీట్ ప్రారంభించి చాలాసేపు అయ్యింది కదా.. రావడానికి ఆలస్యమెందుకయ్యింది?’’ అని ప్రశ్నించిన తరుణంలో ఆమె అందుకు బదులిస్తూ.. ‘‘తాను పూరీ-ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా వుండటం వల్ల త్వరగా రాలేకపోయానని.. అయితే ఆ మూవీ లంచ్ బ్రేక్ లో కాస్త విరామం లభించడం వల్ల హడావుడిగా ఇక్కడికి హాజరయ్యానని’’ ఆమె పేర్కొందట! ఈ విషయా్న్ని తెలుసుకున్న కోట.. తన నాలుక్కరుచుకున్నారు. కాజల్ ప్రెస్ మీట్ కు రావడం లేదనుకుని తాను అలా వ్యాఖ్యానించానని.. వాటిని అంత సీరియస్ గా తీసుకోవద్దని ఆయన మీడియాతో చెప్పినట్లు తెలిసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  govindudu andari vadele  kota srinivas rao  telugu news  

Other Articles