Ram charan got angry on director krishna vamshi while govindudu movie shooting on songs

ram charan, ram charan govindudu andari vadele, govindudu andari vadele movie, ram charan kajal agarwal, director krishna vamsi, krishna vamsi movies, prakash raj, hero srikanth, kamilini mukherjee, ram charan kajal news

ram charan got angry on director krishna vamshi while govindudu movie shooting on songs

గోవిందుడు దర్శకుడికి చెర్రీ చుక్కలు!

Posted: 10/11/2014 05:54 PM IST
Ram charan got angry on director krishna vamshi while govindudu movie shooting on songs

ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమా సక్సెస్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలో రామ్ చరణ్ ఏ విధంగా అయితే తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో.. అదేవిధంగా ఇతరులు కూడా తమతమ నటనతో అందరినీ అలరించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తాత పాత్రలో ప్రకాష్ రాజ్, బాబాయ్ పాత్రలో శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమిలినీ ముఖర్జీ.. ఇంకా తదితరులు తమతమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. దీంతో ఈ సినిమాలో వున్న నటీనటులందరూ బాగానే నటించారంటూ విమర్శకులు కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. తాజాగా రామ్ చరణ్ తేజ్, డైరెక్టర్ కృష్ణవంశీకి మధ్య కొన్ని అవాంతరాలు చోటుచేసుకున్నాయనే వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ ఈ సినిమా సక్సెస్ వేడుకలు చేసుకుంటుంటే.. చెర్రీ మాత్రం చాలాకోపంగా వున్నాడని అంతర్గత వార్తలు వెలువడుతున్నాయి.

అదేమిటంటే... ‘‘రా రాకుమారా..’’ అనే పాటలో కాజల్ అగర్వాల్ చాలావరకు తన అందాన్ని ఆరబోసేసింది. ఎప్పుడూలేని విధంగా సెక్సీగా కనువిందు చేసింది. అలా కనిపించడానికి కారణం డైరెక్టర్ కృష్ణవంశీ! ఎందుకంటే.. ఆ పాటలో కృష్ణవంశీ, కాజల్ ని ఏకంగా 11 ఫ్రేముల్లో క్లోజప్ లో చూపించేశారు. అలాగే హాట్ హాట్ గా కనిపించేలా డ్రెస్సులు వేశారు. అయితే చరణ్ ని మాత్రం కేవలం 3 క్లోజప్ షాట్స్ లోనే చూపెట్టాడు దర్శకుడు! మొత్తంగా చెప్పాలంటే.. ఈ పాటలో చరణ్ వున్నప్పటికీ ఎక్కువగా హైలైట్ అయ్యింది మాత్రం కాజల్ అగర్వాల్! అయితే సినిమా విడుదలకు ముందు చరణ్ తన స్నేహితులతో కలిసి ఈ పాటను వీక్షించాడట! అప్పుడు అతని స్నేహితులు ఆ పాటను చూసి అభ్యంతరం తెలిపారట! ‘‘ఇదేంటి.. పాట మొత్తంలో కాజల్ మాత్రమే ఎక్కువగా హైలైట్ అయ్యింది.. నీ క్లోజప్ షాట్స్ చాలా తక్కువగా వున్నాయే’’ అంటూ చెప్పడంతో చెర్రీ హర్ట్ అయ్యాడట! అలాగే డైరెక్టర్ మీద కాస్త అలిగాడట! అయితే ఆ సమయంలో కృష్ణవంశీ ‘‘ఆ పాటని అలాగే తీయాలి’’ అని చెప్పడంతో తర్వాత చెర్రీ కూల్ అయ్యాడట! ఈ విషయాన్ని స్వయంగా కృష్ణవంశీయే శుక్రవారం జరిగిన సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

ఇక ప్రకాష్ రాజ్ మీద చిత్రీకరించినా ‘‘నీలిరంగు చీరలోనా..’’ అనే పాట విషయంలోనూ చరణ్ ఆలోచనల్లో పడిపోయాడట! సినిమాలో వున్న పాటలన్నింటిలో ఆ పాట చాలా బాగుండటంతో కాస్త ఆలోచనల్లో చెర్రీ పడిపోయాడని పేర్కొన్నాడు. ఈ విషయంపై వంశీ, చరణ్ తో మాట్లాడుతూ.. ‘‘అంత మంచి పాటని ప్రకాష్ రాజ్ పై తీస్తున్నప్పుడు నీకేమీ అనిపించలేదా..?’’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. అందుకు చరణ్ స్పందిస్తూ.. ‘‘నిజంగా చెప్పాలంటే మొదట్లో కాస్త ఆలోచించాను. కానీ అక్కడ తీసిన మాంటేజ్ షాట్స్, ఆ పాటలోని భావం అన్ని చూశాక ఈ పాటని ఇలాగే తీయడం కరెక్టని అనిపించింది. అందుకే తర్వాత ఏమీ ఆలోచించలేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇలా ఈ విధంగా పాటల విషయంలో వీరిద్దరి మధ్య కాస్త అవకతవలు చోటు చేసుకున్నట్లు స్వయంగా దర్శకుడు కృష్ణవంశీయే విశదీకరించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ram charan  krishna vamsi  govindudu andari vadele  kajal agarwal  hero srikanth  

Other Articles