Rajinikanth not satisfied with basha sequel story

rajinikanth, rajinikanth wiki, rajinikanth facebook, rajinikanth movies, rajinikanth latest updates, rajinikanth movies, rajinikanth upcoming movies, rajinikanth photos, rajinikanth latest updates, rajinikanth family, rajinikanth house, rajinikanth twitter, rajinikanth biography, rajinikanth movies, rajinikanth dialogues, rajinikanth basha movie, basha movie dialogues, koliwood latest updates, koliwood movies, koliwood gossips, tollywood latest updates, basha sequel

director plans to make sequel tamil super star super movie basha but rajinikanth not convincing with story : suresh krishna not satisfied rajinikanth to make basha film sequel with his latest script rajini says basha sequel means its not a matter of normal story

భాషా రావాలంటే ఆషామాషీ కాదు

Posted: 10/13/2014 12:29 PM IST
Rajinikanth not satisfied with basha sequel story

తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ డైలాగ్స్ గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా ‘భాషా’ సినిమాలో ‘ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లే’ అనే డైలాగ్ ఎంతో ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ ఈ డైలాగ్ ను సామాన్య ప్రజలు సైతం వాడుతున్నారు. డైలాగులే కాదు ‘భాషా’ సినిమా కూడా అంతే పాపులర్ అయిందని చెప్పాలి. రజినికి కెరీర్ లో ఇదో మైలురాయిగా నిలిచింది. తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ వంటి పొరుగు భాషల్లో కూడా రజిని ఫ్యాన్స్ అయ్యేలా చేసిందీ సినిమా. ఈ సినిమాతో రజినికి క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది.

సినిమాలోని పంచ్ డైలాగులు.. వార్నింగ్ ఇచ్చేసన్నివేశాలతో పాటు రజినీ మ్యానరిజం చూసి అంతా వారెవ్వా అన్నవారే. అలాంటి గొప్ప సినిమాకు సీక్వెల్ తీసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అవి ఇప్పట్లో ఫలితాన్ని ఇచ్చేలా మాత్రం కన్పించటం లేదు. ఈ మూవీని తీసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ ఈ మద్య రజినీని కలిసి సీక్వెల్ పై మాట్లాడారని కోలీవుడ్ వర్గాలు అంటన్నాయి. అనుబంధంగా వస్తున్న మూవీకి సంబంధించి సిద్ధంగా ఉన్న కధ కూడా విన్పించాడట. అయితే ఈ కధపై సూపర్ స్టార్ అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది.

‘భాషా’లాంటి పెద్ద సినిమాకు సీక్వెల్ తీయటం అంటే ఏదో ఒక కధను పట్టుకుని తీయటం కాదు అని రజిని అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమాను టచ్ చేయాలంటే ఆషామాషి కధలు సరిపోవు అని డైరెక్టర్ కు చెప్పారు. సింపుల్ కధతో ‘భాషా’ సీక్వెల్ తీయాలి అనుకోకూడదు అని సూచించారట. దీంతో ఏమి చేకలేక కృష్ణ వెనుదిరిగారని కోలీవుడ్ లో అంతా అనుకుంటున్నారు. దీన్ని బట్టి ఫ్యాన్స్ పెట్టుకునే అంచనాలు.., వారి గురించి రజిని ఆలోచనలు ఏమిటో తెలుస్తుంది. సూపర్ స్టార్ పట్టువీడకపోవటంతో ప్రస్తుతానికి సీక్వెల్ లేకపోయినా.., త్వరలోనే సురేష్ మరో మంచి కధతో వస్తారని ఆశిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  basha  koliwood  movie news  

Other Articles