Boney kapoor serious on ramgopal varma

boney kapoor, boney kapoor movies, boney kapoor marriage, boney kapoor sons, boney kapoor daughters, boney kapoor first wife, boney kapoor sridevi marriage, boney kapoor latest movies, boney kapoor upcoming movies, boney kapoor family, sridevi, sridevi movies, sridevi hot, sridevi latest movies, sridevi upcoming movies, sridevi family, sridevi daughter, sridevi on ramgopal varma, sridevi movie, ramgopal varma sridevi movie, sridevi movie posters, sridevi movie controversy, sridevi movie latest updates, ramgopal varma wiki, ramgopal varma movies, ramgopal varma latest updates, ramgopal varma latest movies, ramgopal varma comments, ramgopal varma comments on god, ramgopal varma on sridevi, tollywood latest updates

ollywood producer and husband of actress sridevi serious on ramgopal varma says he will not leave him till movie name changed : rgv must change sridevi movie name otherwise i will not leave and will go forward on this issue says boney kapoor

వర్మను వదలను!.. శ్రీదేవితో తేల్చుకుంటా !!

Posted: 10/15/2014 11:37 AM IST
Boney kapoor serious on ramgopal varma

రామ్ గోపాల్ వర్మ ‘శ్రీదేవి’ వివాదం రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ సినిమా మొదటి నుంచి వివాదాస్పదం కాగా.., ‘సావిత్రి’ పేరును ‘శ్రీదేవి’గా మార్చటంతో ఇది మరింత దుమారం రేపుతోంది. ‘శ్రీదేవి’ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది అతిలోక సుందరి, బోని కపూర్ భార్య. దీంతో వర్మ తీస్తున్న ఈ సినిమాపై బోని కుటుంబం సీరియస్ గా ఉంది. ఇప్పటికే తన పేరును తొలగించాలంటూ శ్రీదేవి పేరుతో వర్మకు నోటిసులు వెళ్లాయి. అయితే ఈ విషయంపై సంచలనాల డైరెక్టర్ వివరణ కూడా ఇచ్చారు.

అయినా సరే గొడవ మాత్రం తగ్గలేదు. పేరు మార్చే వరకు వర్మను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శ్రీదేవి విషయం ఏంటో తేలాల్సిందే అని బోని కపూర్ ఆగ్రహంగా ఉన్నారు. తన కుటుంబం పరువు కోసం ఎంతదాకా అయినా వెళ్ళటానికి సిద్ధమే అని స్పష్టం చేస్తున్నారాయన. సినిమాలు తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కాని ఇలా వివాదాస్పదం చేస్తూ ఒకరికి ఇబ్బంది కల్గించే విధంగా చేయటం సరికాదు అని హితవు పలికాడు. పేరు మార్చుకుని సినిమా తీస్తే అభ్యంతరం లేదు కాని.., అలా జరగకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాడు.

శ్రీదేవికి అభిమాని అని చెప్పుకుంటూ ఇలాంటి సినిమాలకు ఆమె పేరును పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాము తనను తాను వివాదాస్పదం చేసుకుంటున్నాడు. ఇది అతనికి ఇబ్బందులు కల్గిస్తుంది అని సూచిస్తున్నాడు. శ్రీదేవి కామెంట్లపై వర్మ ధీటుగా స్పందించి సినిమా పేరు మార్చబోనని స్పష్టం చేశారు. ఇప్పుడు బోని వార్నింగ్ పై ఎలా కామెంట్ చేస్తారో చూడాలి. వర్మ సినిమాపై ఇప్పటికే సమాజంలోని పలు సంస్థలు, మహిళా సంఘాల నుంచి విమర్శలు వస్తుండగా.., ఇది మరొక తలనొప్పిగా మారింది. ఈ గొడవల మద్య యువకుడి కధ ఎటు వెళ్తుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramgopal varma  boni kapoor  sridevi  latest updates  

Other Articles