Pataas movie ready to release in december

kalyan ram, kalyan ram wiki, kalyan ram movies, kalyan ram latest updates, kalyan ram photos, kalyan ram latest movies kalyan ram family, kalyan ram pataas movie, ntr, jr ntr, ntr wiki, ntr movies, ntr latest movies, ntr marriage, ntr son, ntr family, latest telugu movies, telugu latest gossips, pataas movie, pataas movie updates, pataas movie latest photos, pataas movie release date, pataas movie songs, nandamuri fans, nandamuri family heros, tollywood latest updates

kalyan ram latest movie pataas getting ready to release in the month of december : in pataas movie kalyan ram acting as a police character the movie getting ready fastly to release in december

‘పటాసు’లు చివరాఖర్లో పేలతాయట !!

Posted: 10/15/2014 09:15 AM IST
Pataas movie ready to release in december

నందమూరి కుటంబ హీరో కళ్యాణ్ రామ్ తాజా సినిమా ‘పటాస్’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ 90శాం వరకు పూర్తయిందట. ఇక మిగిలిన భాగంను త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెడతామని సినిమా యూనిట్ చెప్తోంది. దాదాపు రెండు నెలల పోస్ట్ ప్రొడక్షన్ పనుల తర్వాత డిసెంబర్ లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ మూవీపై కళ్యాణ్ రామ్ ఫేస్ బుక్ లో స్పందిచారు. సినిమా షూటింగ్ బాగా జరుగుతోందన్నారు. కధ, షూటింగ్ పై సంతోషం వ్యక్తం చేశాడు. రామ్ సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా రచయిత అనిల్ రావిపూడి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ‘పటాస్’కు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. కొద్దికాలంగా రామ్ సినిమాలు రాకపోవటంతో.. ఈ మూవీపై నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందని ‘పటాస్’ వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ మూవీ తర్వాత ‘షేర్’ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఇది కూడా షూటింగ్ జరుపుకుంటోంది. కళ్యాణ్ రామ్ హీరోగా కాకుండా.., తన బ్యానర్ లో ‘కిక్2’ సినిమాను నిర్మిస్తున్నారు. నందమూరి నటవంశం నుంచి వచ్చిన హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంటుంది అని అంతా అనుకున్నారు. అయితే వేగంగా పనులు జరగటంతో త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కానుంది. ఆ తర్వాత ఆలస్యం చేయటం వల్ల ప్రయోజనం ఉండదు అని భావించి ముందుగానే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pataas movie  kalyan ram  latest updates  tollywood  

Other Articles