Heroines donations to hudhud cyclone victims

tollwyood heroines donations to hudhud, hudhud tollywood donations, telugu heros donations to hudhud victims, hudhud cyclone effect, hudhud cyclone rescue operations, tollywood latest updates, andhrapradesh latest news

tollywood heroines donations to hudhud cyclone victims : now its turn of tollywood heroines they also donating funds to hudhud cyclone victims first stated this with rakul preet singh

తుఫాను బాధితులకు తారల విరాళాలు

Posted: 10/15/2014 04:02 PM IST
Heroines donations to hudhud cyclone victims

తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఏపీని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా కదిలారు. తమవంతుగా బాధితులకు సాయం చేస్తున్నారు. హీరోయిన్ల తరపున ముందుగా మందుకు వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. తనవంతుగా ఒక లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఆ తర్వాత హీరోయిన్ సమంత ప్రత్యుష ఫౌండేషన్ తరపున రూ.10లక్షలను విరాళంగా ప్రకటించింది. అటు కాజల్ అగర్వాల్ రూ.5లక్షలను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా పంపిస్తున్నట్లు ప్రకటించింది.

వీరితో పాటు హీరోయిన్ రాశి ఖన్నా రూ.1లక్షను విరాళంగా ఇచ్చింది. అటు నటి, నిర్మాత, డైరెక్టర్ రేణు దేశాయ్ తనవంతుగా రూ.25లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చింది. వీరిందరిలో చైతన్యం తెచ్చేలా చేసింది రకుల్ ప్రీత్ అనే చెప్పాలి. చేసింది తక్కువ సినిమాలు, సంపాదించింది తక్కువ ఆదాయమే అయినా.., ఆపద వచ్చిందని తెలియగానే తనవంతు సాయం చేసింది. మిగతా వారితో పోలిస్తే లక్ష రూపాయలు చిన్నమొత్తం కావచ్చు కానీ.., తనున్న పరిస్థితికి ఇది సరైన సహాయమే అని మెచ్చుకోక తప్పదు. హ్యాట్సాఫ్ టు రకుల్ ప్రీత్ సింగ్.

మిగతా హీరోయిన్లు కూడా తమవంతుగా సాయం చేస్తున్నారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బులు పంపించటంతో పాటు వివిద స్వచ్ఛంద సంస్థలు, ఇతర మార్గాల ద్వారా బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారికి బాధితుల తరపున తెలుగు విశేష్ కృతజ్ఞతలు చెప్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  heroines  latest updates  hudhud  

Other Articles