Naga chaitanya next movie with trikoti

naga chaitanya next movie, naga chaitanya trikoti movie, naga chaitanya upcoming movies, trikoti movies, dikkulu chudaku ramayya review, akkineni family heros, akkineni akhil first movie, tollywood latest updates

hero naga chaitanya next movie with trikoti : latest director trikoti to direct his second movie with naga chaitanya rumors that chaitu also accepted this project

జెస్సి లవర్ తో కోటి సినిమా

Posted: 10/15/2014 04:18 PM IST
Naga chaitanya next movie with trikoti

యాక్షన్, ఫ్యాక్షన్ ప్రయత్నాలు చేసి చేయి కాల్చుకున్న నాగచైతన్య ఇప్పుడు మళ్ళీ లవర్ బాయ్ సినిమాలు చేస్తున్నాడు. ‘ఒక లైలా కోసం’ అందులో భాగమే అని చెప్పవచ్చు. అయితే త్వరలోనే చైతు కొత్త ప్రాజెక్టులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘దిక్కులు చూడకు రామయ్య’ తో హిట్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ త్రికోటి నాగచైతన్యతో సినిమా చేస్తున్నట్లు ఫిలింనగర్ లో అంతా అనుకుంటున్నారు. తొలి హిట్ తో డైరెక్టర్ కు మంచి ఆఫర్లు వస్తున్నా ఆయన మాత్రం అక్కినేని కుటుంబంతో రెండవ సినిమా చేయాలి అనుకుంటున్నాడట.

తమ ఫ్యామిలితో సినిమా చేయాలని గతంలోనే త్రికోటికి నాగార్జున అవకాశం ఇచ్చాడట. అయితే పలు కారణాల వల్ల ఇది కుదరలేదు. ప్రస్తుతం తనను తాను నిరూపించుకున్న త్రికోటి నాటి ఆఫర్ ను ఇఫ్పుడు వినియోగించుకుంటున్నాడు. ఇది అక్కినేని ఫ్యామిలి సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లేదా త్రికోటికి కలిసి వచ్చిన వారాహి సంస్థలు నిర్మించే అవకాశం ఉంది.

నాగ చైతన్య సినిమా హిస్టరీ గురించి తీసుకుంటే.. లవర్ బాయ్ సినిమాలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. యాక్షన్, ఫ్యాక్షన్ ప్రయత్నాలు చేసిన ప్రతిసారి దెబ్బతినటమే జరిగింది. మరి లవ్ తో పాటు వెరైటీ కధను తెరకెక్కించిన త్రికోటి చైతు కోసం ఎలాంటి స్క్రిప్టు సిద్ధం చేశాడు.. ఇది లవర్ బాయ్ కు సరిపోతుందా వంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  trikoti  latest updates  tollywood  

Other Articles