Watch gift to dhanush for singing a in vajrakaya movie

dhanush song in vajrakaya movie, dhanush songs, dhanush next movies, why this kolaveri di song, telugu evergreen songs, telugu hit songs, tamil popular songs, latest wrist watches, tamil latest updates, vajrakaya movie updates

danush to receive a watch from arjun janya : tamil star dhanush recently sung a song for kannada movie for that music director arjun janya and team to gift a watch to dhanush

నిమిషానికో లక్ష తీసుకుంటున్నాడట

Posted: 10/16/2014 11:39 AM IST
Watch gift to dhanush for singing a in vajrakaya movie

‘వై దిస్ కొలవరి’ అనే ఒకే పాటతో ఊపేసిన ధనుష్ అభిమానుల కోసం మరోసారి పాట పాడాడు. త్వరలోనే కొలవరి గొంతును ఫ్యాన్స్ వినబోతున్నారు. కన్నడలో వస్తున్న ‘వజ్రకాయ’ అనే సినిమాలో ఓ పాటను ధనుష్ పాడాడు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న అర్జున్ జన్య.., ఓ పాటకు ధనుష్ గొంతు అయితేనే బాగుంటుందని భావించి చెన్నైకి వెళ్లి కలిశాడు. లిరిక్స్ విన్పించటంతో గొంతు అద్దెకిచ్చేందుకు ఒప్పుకున్నట్లు శాండిల్ వుడ్ వర్గాలు చెప్తున్నాయి. మంగళవారమే ఈ పాటను చెన్నై స్టూడియోలో రికార్డ్ చేశారట.

ఇకపోతే సినిమాలో దాదాపు నాలుగు నిమిషాలు ఉండే ఈ పాట కోసం ధనుష్ కు ఇస్తున్నది రూ.4లక్షలట. అయితే ఇది డబ్బు రూపంలో మాత్రం కాదు.., పాట పాడినందుకు ధనుష్ కు ఓ ఖరీదైన వాచిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు. ఈ వాచి విలువ రూ.4లక్షలు ఉంటుందని అంతా చెప్తున్నారు. డబ్బులు ఇస్తే.., ధనుష్ గొంతుకు వెల కట్టినట్లు అవుతుంది కాబట్టి ఇలా బహుమతి అందిస్తున్నామని నిర్మాత మనోహర్ చెప్పారు. అయితే ఈ చేతి వాచి ధర ఎంతో మాత్రం ఆయన చెప్పలేదు. కానీ మార్కెట్లో ప్రస్తుతం ఖరీదైన వాచిల్లో ఎక్కువగా వాడుతున్నది రూ.4లక్షలు ఉండటంతో ఇదే వాచి ఇస్తారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.  

శివరాజ్ కుమార్ హీరోగా ‘వజ్రకాయ’ రూపొందుతోంది. హర్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. చాలారోజుల తర్వాత ధనుష్ పాట పాడటంతో.., ఈ సినిమాకు పాట ప్లస్ పాయింట్ అవుతుందని కన్నడ సినీ వర్గాలు అంటున్నాయి. రజినికాంత్ అల్లుడిగా అందరికి సుపరిచితుడైన ధనుష్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పాడిన తొలి పాట ‘వై దిస్ కొలవరి’ దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ పాటతోనే ధనుష్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చాలామంది తెలుగు హీరోలు ఈ తరహా పాటలను పాడారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhanush  wrist watch  vajrakaya  latest updates  

Other Articles