Rudramadevi alluarjun first look

allu arjun fist look in rudramadevi, allu arjun in rudramadevi movie, allu arjun next movie, rudramadevi release date, rudramadevi movie latest updates, gona ganna reddy, anushka in rudramadevi, tollywood latest updates

rudramadevi alluarjun first look : allu arjun first look in rudramadevi movie released he is in gona ganna reddy character in this movie, first look of bunny shows his heroism in the character you can see his first look

గోనగన్నారెడ్డి తొలిసారి బయటకు వచ్చాడు

Posted: 10/18/2014 09:51 AM IST
Rudramadevi alluarjun first look

స్టైలిష్ స్టార్ కోసం అభిమానుల నిరీక్షణ ఫలించింది. రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల అయింది. భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న కాకతీయ వీరనారి కధలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజుల కాలం నాటి మూవీలో బన్నీ గెటప్ ఎలా ఉంటుందో అని అభిమానులంతా ఆసక్తి పెంచుకున్నారు. వీరి ఎదురుచూపులకు సమాధానంగా అల్లు ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. క్యారెక్టర్ కు తగ్గట్లే హీరోయిజం చూపించేలా ఫొటో ఉంది. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఇది ఉంది అని అంతా అంటున్నారు.

ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘రుద్రమదేవి’లో అనుష్క లీడ్ రోల్ చేస్తుండగా.., రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరేకాకుండా కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్ కెథరిన్ తదితరులు కూడా కీలక పాత్రలను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ‘అరుంధతి’ తర్వాత అనుష్క చేస్తున్న ఈ లీడ్ క్యారెక్టర్ ఆమెకు టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అంతా చెప్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే గ్రాఫిక్స్ ఇతర విజువల్ ఎఫెక్ట్ లకు సమయం తీసుకుంటుండంతో కాస్త ఆలస్యం తప్పదని తెలుస్తోంది.

Gona-Ganna-Reddy-First-Look

భారీ సెట్టింగులు.., కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన ఈ సినిమాకు విడుదల కాకముందే అవార్డులు ఖాయమని సినిమా ప్రముఖులు చెప్తున్నారు. తెలంగాణ చరిత్రలోని కాకతీయ పాలనకు సంబంధించిన ఈ సినిమాకు గుణశేఖర్ విజ్ఞప్తితో తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయించింది. దీంతో బడ్జెట్ లో కాస్త ఊరట లభించినట్లు అయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ మీకు అందిస్తుంటాము.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rudramadevi  allu arjun  first look  latest updates  

Other Articles