Taapsee about her latest baby movie with akshay kumar

taapsee baby movie, baby movie latest updates, akshay kumar in baby movie, akshay kumar next movie, bollywood latest updates, tollywood latest updates, taapsee pannu movies, telugu comedy movies

taapsee comments over her latest baby movie with akshay kumar : heroine taapsee responded about her latest movie baby says, it is main project for her, hopes that that this movie will give turning point to taapsee film career

నా బేబి గురించి చాలా జాగ్రత్త పడ్డాను

Posted: 10/18/2014 10:39 AM IST
Taapsee about her latest baby movie with akshay kumar

బిడ్డ గురించి తల్లి ఎంతగా ఆలోచిస్తుందో ఎవరూ చెప్పనవసరం లేదు. ప్రతి తల్లి తన బేబి బాగుండాలని ఎంతో కోరుకుంటుంది. కాని తాప్సి మాత్రం సినిమా బాగుండాలని జాగ్రత్త పడుతుందట. తాను నటించిన ‘బేబి’ సినిమా బాగారావాలని ఎంతో కష్టపడుతున్నట్లు చెప్తోంది. అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే కొద్దికాలంగా సొట్టబుగ్గల సుందరి సినిమాలు రావటం లేదు. తెలుగులోనే తీసుకుంటే ‘సాహసం’ తర్వాత తెరపై కన్పించలేదు.

ఇక ఇతర భాషాల్లో కూడా సినిమాలు వచ్చి సంవత్సరం దాటుతోంది. దీనికి కారణం ఏమిటని అడిగితే.., అల్లాటప్పా సినిమాలు ఎందుకు చేయటం.., కత్తిలాటి కధ ఉంటే ప్రేక్షకుల ముందుకు రావాలని సెలవిస్తోంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసే కంటే ‘బేబి’లాంటి సినిమా ఒకటి చేసినా చాలు అని చెప్తోంది. మరి కధ నచ్చిందా.. లేక వారు ఇచ్చిన కాసుల మూట ఈ బేబిని మెప్పించిందా అనేది సినిమా విడుదల అయితేనే తెలుస్తుంది. ప్రస్తుతం ‘బేబి’ షూటింగ్ జరుగుతోంది.

వరసగా ఖాళీ లేకుండా సినిమాలు తీసి సొట్టబుగ్గలతో గ్లామర్ గర్ల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సి తెలుగులో మళ్ళీ ఎప్పుడు కన్పిస్తుందో చూడాలి. ఇక ఈ అమ్మడికి సంబంధఇంచి ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో పాటు ఓ హిందీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taapsee  baby movie  akshay kumar  latest updates  

Other Articles