Manchu manoj helps vizag hudhud victims with his team members

manchu manoj, tollywood rocking star, rocking star manchu manoj, manchu manoj latest news, manchu manoj hudhud victims, manchu manoj vizag hudhud victims, manchu manoj news, manchu manoj current theega movie, current theega movie updates, sunny leone current theega, telugu movie news websites, telugu movie news, movies news websites, vizag hudhud victims, hudhud cyclone

manchu manoj helps vizag hudhud victims with his team members and supplies food, curries, buscuit and water packets which worth total 30 lakhs amount

రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్న రాకింగ్ స్టార్!

Posted: 10/20/2014 01:09 PM IST
Manchu manoj helps vizag hudhud victims with his team members

విభిన్న కథాచిత్రాలతో టాలీవుడ్ రాకింగ్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న మంచు మనోజ్... రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ నిజమైన హీరోగా పేరు సంపాదించుకున్నాడు. అదెలాఅంటే.. మొన్నొచ్చిన ‘‘హుధుద్’’ తుపాను భీభత్సానికి విశాఖపట్నం మొత్తం అతలాకుతమైన నేపథ్యంలో టాలీవుడ్ హీరోలందరూ తమదైన రీతిలో సహాయాన్ని అందించారు. కొందరు డబ్బుల రూపంలో విరాళాలు అందిస్తే.. మరికొందరు ఫుడ్ ప్యాకెట్లను అందించారు. అయితే రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాత్రం వీరందరికీ భిన్నంగా ఆ నగరవాసులకు సహాయాన్ని అందించి, వాళ్ల దృష్టిలో నిజమైన హీరోగా నిలిచిపోయారు.

‘‘హుధుద్’’ తుపాను ఆగిన 2 రోజుల తరువాత మంచు మనోజ్ తన టీం మెంబర్స్ తో కలిసి నేరుగా కార్యరంగంలోకే దిగిపోయాడు. మొత్తం 70 మంది కుర్రాళ్లతో కలిసి వైజాగ్ వెళ్లిన మనోజ్.. అక్కడే నాలుగురోజులపాటు తిరిగి.. తుపాను బాధితులందరికి 7 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 టన్నుల బియ్యం, 2 టన్నుల పప్పుధాన్యాలు, 5 లక్షల క్యాండిళ్లు, 3 లక్షల బిస్కెట్ ప్యాకెట్లను అందజేసినట్లు సమాచారం. మరికొందరు రాజకీయ నాయకులు కూడా మంచో మనోజ్ తో కలిసి అక్కడి బాధితులందరికీ సహాయం అందించినట్లు తెలిసింది. దాదాపు 30 లక్షల రూపాయల విలువైన సహాయాన్ని ఈ రాకింగ్ స్టార్ అక్కడి బాధితులకు అందించినట్లు మనోజ్ బృందం తెలుపుతున్నారు. అయితే అక్కడ సమాచార వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడంతో మనోజ్ అందించిన ఈ సహాయానికి సంబంధించిన అప్ టేడ్స్ బయటికి రావడం ఆలస్యమైంది.

అంతేకాదు.. ‘‘హుధుద్’’ తుపాను భీబత్సంతో అక్కడ చాలా నష్టం వాటిల్లినందున తన సినిమా ‘‘కరెంట్ తీగ’’ విడుదలను వాయిదా వేసుకునిమరీ మనోజ్ అక్కడికి వెళ్లి నేరుగా కార్యరంగంలోకి దిగిపోయాడు. ఇతర హీరోల కేవలం విరాళాలు మాత్రమే ఇచ్చి తప్పుకోకుండా మనోజ్ నేరుగా రంగంలోకి దిగి, తనవంతు సహాయం వల్ల ఆ విశాఖనగర వాసుల దృష్టిలో ఇతడు రియల్ హీరోగా అనిపించుకున్నాడు. ఈ విధంగా మనోజ్ అందించిన సహాయాన్ని చూసి విమర్శకులు సైతం ‘‘భేష్’’ అంటూ అతనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu manoj  hudhud cyclone  current theega movie  tollywood news  hudhud victims  

Other Articles