Colors swathi reddy comments on ramgopal varma

colors swathi, swathi reddy, colors swathi reddy news, colors swathi movies, colors swathi press meet, colors swathi interview, colors swathi ram gopal varma, colors swathi comments ram gopal varma, ram gopal varma news, ram gopal varma twitter, colors swathi photos, colors swathi hot photos

colors swathi reddy comments on ramgopal varma about appalaraju movie experience

వర్మను తిట్టిపొగిడేసిన కలర్స్ పిల్ల!

Posted: 10/20/2014 01:28 PM IST
Colors swathi reddy comments on ramgopal varma

సినిమా జగత్తులోనే వివాదాస్పద కథాంశాలతో తనకంటూ ఒక ప్రత్యేకపేరును సంపాదించుకున్న సంచలన దర్శకుడితో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ నుంచి పెద్ద హీరోలు సైతం పనిచేసినవాళ్లు చాలామంది వున్నారు. వారందరితో వర్మ తీసిన సినిమాలు ఒకవేళ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయితే వాళ్లు ఈ వివాదస్పద దర్శకుడిని పొగొడ్తలతో ముంచెత్తిన సందర్భాలూ వున్నాయి కానీ.. విమర్శించినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. ఒకవేళ వున్న.. అవి అప్పుడికప్పుడే సద్దుమణిగిపోతాయి. అయితే ఇక్కడ కలర్స్ స్వాతి మాత్రం వర్మను తిట్టిందా.. లేక పొగిడిందా..? అన్నది పూర్తిగా అర్థంకాని ప్రశ్నగానే మారిపోయింది. ఇంతకి ఆమె వర్మ గురించి ఏం మాట్లాడిందనేగా సందేహం..? పదండి తెలుసుకుందాం...

‘‘కలర్స్ ప్రోగ్రామ్ లో నాకు అనుకోకుండా ఆఫర్ వచ్చింది. అలాగే మీడియాలో, సినిమాల్లో సులభంగానే అవకాశాలు రావడం మొదలయ్యాయి. తర్వాత ‘‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అష్టాచెమ్మా’’ వంటి సినిమాల్లోనూ నటించే ఆఫర్లు వచ్చాయి. అప్పటివరకు వరుస విజయాలతో చాలా హ్యాపీగానే వుండేదాన్ని! నా కెరీర్ ను అస్సలు సీరియస్ గా తీసుకునేదాన్నే కాదు. అయితే అప్పల్రాజు సినిమా చేసిన తర్వాత ఒక్కసారిగా నా కళ్లు తెరుచుకున్నాయి. సినిమా ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాం..? ఏం చేయాలి..? అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక సినిమా విజయం విలువేంటో ‘‘అప్పల్రాజు’’ చిత్రం ద్వారానే తెలిసింది’’ అని చెప్పుకొచ్చింది ఈ రంగురంగుల (కలర్స్) అమ్మడు! ఇలా అంటూనే.. ‘‘ముందు వెనుకా ఆలోచించకుండా ‘‘కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’’ సినిమా ఒప్పుకోవడం దాని వ్యాల్యూ ఏంటో విడుదలయ్యాక తెలిసింది. ఆ సినిమా నా కెరీర్లోనే పెద్ద టర్నింగ్ పాయింట్’’ అని వెల్లడించింది.

దీంతో కలర్స్ స్వాతి రాంగోపాల్ వర్మ మీద ఈ విధంగా వ్యాఖ్యలు సంధించిన సందర్భాన్ని చూస్తుంటే.. ఆమె వర్మను పొగిడిందా..? లేక తిట్టిందా..? అనేది అర్థం కావడం లేదు. ఆ సినిమా తర్వాత వర్మ నుంచి యాక్టింగ్ స్కిల్ నేర్చుకున్నాను అని చెబుతూనే వర్మతో కలిసి మళ్లీ సినిమాలు తీయకూడదనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో తర్వాత సినిమాలు ఆచితూచి ఎంచుకున్నానన్నట్లు కలర్స్ స్వాతి చెబుతోందని విశ్లేషకుల అభిప్రాయం! మరి ఈ విషయం మీద వర్మ ఎలా స్పందిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : colors swathi reddy  ram gopal varma  appalaraju movie  actress interview  telugu news  

Other Articles