Actress anjali feeling insecure with trisha and poorna in a tamil movie role

actress anjali, anjali latest news, anjali hot photos, anjali latest photo shoot, anjali kollywood movies, anjali tollywood movies, anjali telugu movies, trisha latest news, trisha hot photos, trisha hot gallery, anjali trisha, actress poorna, poorna hot photo shoot, tamil movie, hero jayam ravi

actress anjali feeling insecure with trisha and poorna in a tamil movie role

అంజలి కెరీర్ కి అడ్డుపడుతున్న ఐటమ్ అగ్రతార!

Posted: 10/20/2014 03:07 PM IST
Actress anjali feeling insecure with trisha and poorna in a tamil movie role

సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడు తగాదాలు రావడం సహజం! అవి వ్యక్తిగత విషయాలు కావొచ్చు లేదా సినిమాపరంగా కావొచ్చు కానీ.. మరీ ఒకరి జీవితాన్ని మరొకరు నాశనం చేసుకునేంత పగ-ప్రతీకారాలు మాత్రం పెంచుకోరు. కొన్నాళ్ల తరువాత ఏదో ఒక విధంగా తారల మధ్య వుండే దూరం తగ్గిపోతుంది. అయితే ఇక్కడ అంజలి విషయం మాత్రం చాలా గందరగోళంగా వున్నట్లు తెలుస్తోంది. ఒక ఐటమ్ గర్ల్, ఇంకొక అగ్రతార వల్ల తన కెరీర్ ఎక్కడ నాశనమవుతుందోనన్న భయాందోళనల్లో అంజలి వున్నట్లు భావిస్తోంది. ఇప్పుడు కెరీర్ మొత్తం గాడిలో పడి చిన్న సినిమాల ద్వారా మెల్లగా కోలుకుంటున్న అంజలికి... అనుకోకుండా ఆ ఇద్దరు భామలు తన కెరీర్ కే ఎసరు పెట్టే విషయాన్ని జీర్ణించుకోలేకపోతోందని సమాచారాలు వస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే... ‘‘గీతాంజలి’’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన అంజలికి భారీ ఆఫర్లు రాకపోయినా ఓ మోస్తరు బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీ ఆఫర్లు మాత్రం వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ అమ్మడికి తమిళంలో జయంరవి హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసింది. దీంతో మురిసిపోయిన అంజలి.. ఆ సినిమాలో తానే ప్రధాన కథానాయిక అనుకోని ఎంతో సంతోషపడింది. ఆ సినిమాతో తాను మళ్లీ తన స్టార్ డమ్ ను తిరిగి పొందవచ్చునని అనుకుంది. అయితే ఇంతలోనే ఓ అగ్రతార ఆమెకు అడ్డుపడినట్లు తెలుస్తోంది. ఆ అగ్రతార మరెవ్వరో కాదు.. హీరోయిన్ త్రిష! అంజలి నటిస్తున్న సినిమాలోనే త్రిష కూడా మరో కథానాయికగా జాయిన్ అయిందని కోలీవుడ్ సమాచారం! తానే ప్రధాన నాయిక అంటూ మురిసిపోయిన అంజలికి.. ఇప్పుడు మరో కథానాయికగా ఎంట్రీ అవ్వడంతో ఆమె చాలా బాధపడుతోందని, త్రిష వుండటం వల్ల తన పాత్ర పలుచనైపోతుందని తెగ ఫీల్ అవుతోందని టాక్ నడుస్తోంది.

అంతేకాదు.. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెంసాంగ్ కోసం దర్శకనిర్మాతలు పూర్ణను కూడా తీసుకున్నారు. ఈ ఐటంసాంగ్ లో ఈ అమ్మడు తన అందాలను బాగానే ఆరబోసే సీన్లు ఎక్కువగానే వున్నాయని చిత్రబృందాలు పేర్కొంటున్నాయి. దీంతో అంజలికి మరింత టెన్షన్ పట్టుకుందట! చాలా గ్యాప్ తర్వాత ఓ కోలీవుడ్ మూవీలో ఆఫర్ వచ్చిన తనకు ఆ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటుంటే.. ఇంతలోనే ఓ పక్క త్రిష, మరోపక్క పూర్ణ ఐటెంసాంగ్ జతకావడంతో తన పాత్రకు ప్రాధాన్యత అంతగా వుండదని అంజలి భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఓ ఐటెం భామ, అగ్రతార త్రిష ఇద్దరూ అంజలి కెరీర్ కి అడ్డుపడుతున్నట్లుగా అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో వార్తలు జోరందుకున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress anjali  trisha  actress poorna  hero jayam ravi  telugu news  

Other Articles