ఎక్కడో శృంగార సినిమాలు తీసుకుంటూ కాలం గడుపుతున్న సన్నీలియోన్ కు బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఈమెకు హీరోయిన్ కిరీటాన్ని అందించిన విషయం తెలిసిందే! అంతే... ఇక అప్పటినుంచి తన శృంగారభరితమైన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హాట్ తారగా దూసుకుపోతోంది ఈ సెక్సీ భామ! చిన్న, పెద్దా అనే తేడాలేకుండా ఏ మూవీ ఆఫర్ వస్తే అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అన్ని చిత్రపరిశ్రమ రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకగుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో సౌత్ ఇండస్ట్రీలో కూడా తన హాట్ అందాలను ఆరబోయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాదు.. డబ్బులకోసం అప్పుడప్పుడు పబ్బుల్లో, పార్టీల్లో పొట్టి డ్రెస్సులు ధరిస్తూ యువతను ఉర్రూతలూగిస్తోంది ఈ అమ్మడు! మొత్తానికి ఏదో ఒక విధంగా తన అందాలను ఆరబోస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే వుంది ఈ తార! ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు తెలుగువాళ్లకు కూడా కేవలం 75 లక్షలకే అమ్ముడుపోయిందనే వార్త బాగానే హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. వాళ్లందరికీ తన అందాలను దాదాపు చాలావరకు చూపించిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
అసలు విషయం ఏమిటంటే.. మంచుమనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘‘కరెంట్ తీగ’’ సినిమాలో ఈ శృంగారతార సన్నీ ఒక స్పెషల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే! సినిమాలో కీలకమైన టీచర్ పాత్రలో నటించడంతోపాటు హాట్ ఐటంసాంగులో కూడా బాగానే తన అందాలను ఆరబోస్తూ స్టెప్పులేసింది అమ్మడు! అంతేకాదు.. ఈమె నటించిన పాత్రలో భాగంగా అప్పుడప్పుడు తన అందాలను చూపిస్తూ ప్రేక్షకులను బాగానే రక్తికట్టిస్తుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే సన్నీ నటించిన మొత్తం పాత్రకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 75 లక్షలట! ఈ విషయాన్ని స్వయంగా హీరో మంచు మనోజ్ వెల్లడించాడు. ప్రేక్షకులలో ఆమెకు వున్న క్రేజ్ దృష్ట్యా 75 లక్షలు ఇవ్వడానికి మంచు అంగీకరించడంతోనే సన్నీకి ఈ చిత్రంలో నటించే అవకాశం లభించిందని.. తెలుగు ప్రేక్షకులకు అందాలు ఆరబోసేందుకు సిద్ధపడిందని చిత్రబృందం తెలుపుతోంది. ఇప్పటికే విడుదలైన సన్నీలియోన్ సాంగ్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడంతో సినిమాకు బాగా హైప్ తీసుకొచ్చింది. దీంతో ఆ అమ్మడికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఫేవరబులేనని అనుకుంటున్నారు.
అయితే.. టాలీవుడ్ లో వున్న అగ్రహీరోయిన్లకు తప్ప మిగతావారందరికీ రెమ్యునరేషన్లు 50 లక్షలకంటే ఎక్కువగా వుండదు. అటువంటిది కేవలం ఒక స్పెషల్ పాత్రకోసం సన్నీకి మనోజ్ 75 లక్షలు ఇవ్వడం ఒక సాహసోపేతమైన పనేనంటూ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. ఇదిలావుండగా.. ‘‘కరెంట్ తీగ’’ సినిమాలో మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్-కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు జి.నాగేశర్వరరెడ్డి దర్శకత్వం వహించారు. అయితే అన్నికంటే ఈ సినిమాలో సన్నీలియోన్ పాత్ర చాలా అట్రాక్టివ్ గా వుంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరి.. సన్నీలియోన్ మంత్రం తెలుగువాళ్లమీద ఏ విధంగా పనిచేస్తుందో మూవీ విడుదలైన తర్వాతే తెలియనుంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more