Hero ram charan enjoying holidays for two months

ram charan teja latest updates, ram charan in holiday trip, ram charan family tour, govivndudu andarivadele movie review, tollywood latest updates,

hero ram charan enjoying holiday for two months : tollywood mega power star ram charan in holiday tour he is enjoying two moths trip with family after this tour charan will gets into movies again he may go for kona venkat story with first priority

చెప్పాపెట్టకుండా చెక్కేసిన చరణ్

Posted: 10/22/2014 02:43 PM IST
Hero ram charan enjoying holidays for two months

సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ కన్పించరు. కానీ హిట్ అయినా కూడ కొందరు హీరోలు బయటకు రావటం లేదు. కనీసం ఎక్కడ ఉన్నారో కూడా చెప్పటం లేదు. చెప్పాపెట్టకుండా చెక్కేస్తున్నారు. మొన్న మహేష్ బాబు హాలిడే టూర్ కు వెళ్ళగా.., ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం చెర్రీ ఫ్యామిలితో హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. రెండు నెలల పాటు వివిధ దేశాల్లో ఈ ట్రిప్ కొనసాగుతుంది అని మెగా ఫ్యామిలి వర్గాలు చెప్తున్నాయి. అంటే రెండు నెలల వరకు చెర్రి షూటింగ్ స్పాట్ చాయలకు కూడా రాడు అన్నమాట.

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా హిట్ టాక్ తర్వాత ఫ్యామిలితో కలిసి టూర్ ప్లాన్ చేసిన చెర్రి.., వెంటనే షెడ్యూల్ తయారు చేసుకుని ఒక్కరోజు కూడా మిస్ కాకుండా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడట. ఈ ట్రిప్ ముగించుకుని వచ్చాక తిరిగి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు అని అంతా చెప్తున్నారు. చెర్రీ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నా.. ముందుగా కోన వెంకట్; గోపి మోహన్ సినిమాను చేస్తారని చెప్తున్నారు. ఇఫ్పటికే ఈ ప్రాజెక్టుకు మెగా పవర్ స్టార్ ఓకే చెప్పారు కూడా.

ఇకపోతే చెర్రితో ఛాన్స్ కోసం డైరెక్టర్ శ్రీనువైట్ల తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ‘ఆగడు’ ఫ్లాప్ టాక్ తో కధ బాగా లేదని వైట్లను చెర్రి పక్కనబెట్టారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా శ్రీను మాత్రం సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీలయితే వక్కంతం వంశీతో కూడా కధ చెప్పించాలని భావిస్తున్నారు. మరి వంశీ ప్రయోగం ఫలిస్తుందా.., లేక వికటిస్తుందా తెలియాలంటే చెర్రి తిరిగి రావాలి. అప్పుటి వరకు వైట్ల యువర్ కాల్ ఆన్ వెయిటింగ్ అనుకోక తప్పదు.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  ram charan enjoying holidays  govindudu andarivadele  mega family  

Other Articles