Current theega movie producer manchu vishnu statements on sunny leone character

sunny leone, sunny leone latest news, sunny leone hot photo shoot, sunny leone current theega, current theega movie, manchu vishnu press meet, manchu manoj news, sunny leone bikini photo shoot, rakul preet singh

current theega movie producer manchu vishnu statements on sunny leone character

తెలుగు ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లిన శృంగారతార!

Posted: 10/27/2014 01:31 PM IST
Current theega movie producer manchu vishnu statements on sunny leone character

శృంగారభరితమైన చిత్రాలనుంచి వైదొలగి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్... ఇక్కడ కూడా అదే తరహాలో తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను బాగానే సంతృప్తి పరుస్తూ వస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో నెంబర్ వన్ హాట్ తారగా కొనసాగుతున్న ఈ అమ్మడు.. ఆ విధంగానే సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు పొందేందుకు తెగ ఆరాటపడుతోంది. ఇదివరకే తమిళంలో ఒక సినిమాలో నటించిందిగానీ.. అది ఆమెకు అంతగా గుర్తింపునివ్వలేదు. అందుకే సౌత్ లో వచ్చే అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా తక్కువ పారితోషికానికే హాట్ రోల్స్ చేయడానికి సిద్ధంగా వుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. మంచుమనోజ్ హీరోగా తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న ‘‘కరెంట్ తీగ’’ సినిమాలో సన్నీలియోన్ ఒక కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే ఈమెకు సంబంధించిన ‘‘సన్నీ సన్నీ’’ అనే పాట తెలుగుప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆ పాటలో ఈ అమ్మడు తన అందాలను బాగానే ఆరబోసేసింది. దీంతో సినిమాలోనూ ఈ శృంగారతార తన అందాలను ఇంకా బాగానే ఆరబోసి వుంటుందని ఆ సినిమా విడుదలకోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నారు. పైగా ఈ సినిమాకు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ రావడంతో సన్నీ బాగానే రెచ్చిపోయి వుంటుందని తెగ చర్చించుకుంటున్నారు కూడా! అలాగే ఈ సినిమా నిర్మాత మంచు విష్ణు సైతం తన సినిమాకు A సర్టిఫికెట్ రావడానికి సన్నీలియోన్ పాత్రే కారణమంటూ ఇన్నాళ్లూ బాగానే పబ్లిసిటీ చేసుకున్నాడు. అయితే ఇంతలోనే ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి హీరో మాట మార్చేశాడు.

‘‘కరెంట్ తీగ’’ సినిమాలో సన్నిలియోన్ పాత్ర ఏమాత్రం అశ్లీలంగాగానీ, సెక్సీగాగానీ వుండదని తాజాగా ఒక స్టేట్ మెంట్ ఇచ్చేశాడు మంచు విష్ణు! కుటుంబసభ్యులందరూ కలిసి చూడదగ్గ రీతిలో చాలా సంస్కారయుతంగా ఆమె క్యారెక్టర్ కనిపిస్తుందని అతను చెబుతున్నాడు. దీంతో ఇన్నాళ్లవరకు ఆమె అందాలను చూడటానికి ఎంతో ఆరాటపడిన తెలుగు ప్రేక్షకులంతా ఒక్కసారిగా నిరాశచెందారని చెప్పుకుంటున్నారు. ఇదిలావుండగా... ఎక్కడ ఫ్యామిలీ ఆడియెన్స్ తమ సినిమా చూడటానికి రారేమోనన్న భయంతోనే విష్ణు ఇప్పుడు ఇలా మాటమారుస్తున్నాడంటూ సినీవిశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. ఏకంగా రూ.75 లక్షల పారితోషికాన్ని ఆ అమ్మడికి అందచేసి.. తన ద్వారా అందాలను ఎక్స్ పోజ్ చేయించకుండా ఎందుకు వదులుతారంటూ చప్పుకుంటున్నారు. ఏదేమైనా.. సన్నీ ద్వారా కరెంట్ తీగ సినిమాకు బాగానే పబ్లిసిటీ వస్తోందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  current theega movie  manchu vishnu  rakul preet singh  manchu manoj  telugu news  

Other Articles