Sampoornesh babu character in current theega movie

sampoornesh babu news, sampoornesh babu latest news, sampoornesh babu movie updates, sampoornesh babu interview, sampoornesh babu photos, sampoornesh babu current theega movie, current theega movie, manchu manoj, sunny leone, sunny leone hot photos, rakul preet singh, director g nageswar reddy, music director achchu

sampoornesh babu character in current theega movie

మంచుమనోజ్ ను చేయి చేసుకున్న సంపూర్ణేష్ బాబు!

Posted: 10/27/2014 03:04 PM IST
Sampoornesh babu character in current theega movie

ఒకప్పుడు చిత్రపరిశ్రమలో సాధారణ ఆర్టిస్టుగా కొనసాగుతూ వచ్చిన సంపూర్ణేష్ బాబు... ‘‘హృదయకాలేయం’’ సినిమాతో రాత్రికిరాత్రే ‘‘బర్నింగ్ స్టార్’’గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే! ఆ సినిమా హిట్ అవడం కారణంతో సంపూకు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి ఆఫర్లు వచ్చేశాయి. ప్రస్తుతం నాలుగైదు సినిమాల షూటింగులతో చాలా బిజీగానే వున్నాడు ఈ బర్నింగ్ స్టార్! ఒకవిధంగా చెప్పుకోవాలంటే.. ఇండస్ట్రీలో వున్న చిన్నసినిమాల హీరోల్లో ఇతనిని ఒక సూపర్ స్టార్ గా వర్ణిస్తుంటారు కూడా! మొత్తానికి ఏదోఒకవిధంగా సంపూ బాగానే పేరు సంపాదించుకున్నాడు!

ఇక విషయానికొస్తే.. నిన్నటికినిన్న టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన సంపూ, మంచు ఫ్యామిలీ వారసుడైన మనోజ్ మీద చెయ్యి చేసుకున్నాడనే వార్తలు తెగతిరగేస్తున్నాయి. ఒక స్టార్ కుటుంబం నుంచి వచ్చిన మంచుమనోజ్ లాంటి రాకింగ్ స్టార్ హీరోపై సంపూ చెయ్యిచేసుకున్నాడని టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో! మంచుమనోజ్ హీరోగా నటించిన ‘‘కరెంట్ తీగ’’ సినిమాలో సంపూర్ణేష్ బాబు నటిస్తున్నాడనే విషయం ఇదివరకే తెలిసిందే! ఇందులో సంపూ క్యారెక్టర్ కొద్దిసేపే వున్నప్పటికీ ప్రేక్షకులను బాగానే నవ్విస్తాడని.. ఇందులో భాగంగానే మనోజ్ పై సంపూ చెయ్యి చేసుకునే సన్నివేశాలు వున్నాయని అంటున్నారు.

‘సంపూర్నేష్ బాబు ట్రాక్ సినిమాలో కొద్దిసేపే ఉంటుంది. కానీ ఉన్నంత సేపూ ఆడియన్స్ ని తెగ నవ్విస్తాడు. కరెంట్ తీగ సినిమాకి సంపూర్నేష్ బాబు ట్రాక్ హైలైట్ అవుతుందని’ మంచు మనోజ్ తెలిపాడు. ముఖ్యంగా వీరిమధ్య జరిగే పోరాట సన్నివేశాల సమయంలో సంపూ అందరినీ కడుపుబ్బా నవ్వించేస్తాయని తెలుపుతున్నాడు. ఇక ఇందులో మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సన్నీలియోన్ టీచర్ పాత్రలో కనువిందు చేయనుంది. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీకి అచ్చు సంగీతాన్ని అందించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వర్తపడు వాలిబార్ సంఘం’ సినిమాకి రీమేక్ అయిన ఈ మూవీ.. అక్టోబర్ 31వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampoornesh babu  sunny leone  manchu manoj  rakul preet singh  current theega movie  

Other Articles