Megastar chiranjeevi hit ramcharan with police belt for using vulgar words on his uncle nagababu

megastar chiranjeevi, chiranjeevi latest news, ram charan tej, ram charan tej latest news, ram charan tej chiranjeevi, nagababu latest news, ram charan tej interview, ram charan tej open heart with rk, open heart with rk ram charan, tollywood news, telugu news

megastar chiranjeevi hit ramcharan with police belt for using vulgar words on his uncle nagababu

బూతులు మాట్లాడిన చెర్రీ.. బెల్టు తీసిన చిరు!

Posted: 10/27/2014 03:16 PM IST
Megastar chiranjeevi hit ramcharan with police belt for using vulgar words on his uncle nagababu

చిత్రపరిశ్రమలో వుండే కొంతమంది స్టార్ హీరోలు అప్పుడప్పుడు ఇతరులపై నోరుపారేసుకోవడంగానీ, చేయి చేసుకోవడంగానీ చేస్తుంటారు. చాలావరకు ఇటువంటివి సందర్భాలూ బాలీవుడ్ లోనే ఎక్కువగా చోటుచేసుకుంటాయి. తెలుగు చిత్రపరిశ్రమలో ఇలా ప్రవర్తించే హీరోలు చాలాచాలా తక్కువ! కొంతమంది సందర్భాలను బట్టి తమ కోపాన్ని వ్యంగ్యంగా ఇతరలపై వెళ్లగక్కుతుంటారు గానీ... బూతులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడరు. ఎంతపెద్ద స్టార్ హీరో అయినా సరే... తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి సఖ్యతగా వ్యవహరించడానికే ప్రయ్నతిస్తారే తప్ప.. బూతులు మాత్రం మాట్లాడరు. అయితే ఇక్కడ ఒక సందర్భంలో రామ్ చరణ్ బూతులు మాట్లాడినట్లు సమాచారం! అది విన్న వెంటనే ఆయన తండ్రి చిరంజీవి బెల్టుతో బుద్ధి చెప్పారని చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదులెండి... చెర్రీ 8వ ఏటలో!

రామ్ చరణ్ తేజ్ 8ఏళ్ల వయస్సులో వున్నప్పుడు ఒకనాడు గేటు దగ్గరే ఆడుకుంటున్నాడట! ఆ సమయంలోడ్రైవర్, సెక్యూరిటీ గార్డు ఇద్దరు ఒకరితో ఒకరు కలపడుతూ కొన్ని బూతులు బాగానే తిట్టుకున్నారట! ఇలా వారిద్దరు తిట్టుకుంటుంటే.. అక్కడే వున్న చరణ్ అవి బూతులని తెలియక, వాటిని వెంటనే నేర్చేసుకున్నాడట! అక్కడితో ఊరికే వుండుకోకుండా లోపలికి వెళ్లి ఆ బూతులన్నింటినీ తన బాబాయ్ నాగబాబు మీద ప్రయోగించేశాడట! అతనలా మాట్లాడటం చూసి, ఇంట్లో వున్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పుడు అక్కడే వున్న చిరంజీవి అందరినీ గదిలోనుంచి బయటకు వెళ్లమని ఆదేశించారట! గదిలో చరణ్ ను మాత్రమే ఏకాంతంగా పక్కకు పిలిచి.. ‘‘అతను మాట్లాడిన బూతు పదాలకు అర్థం తెలుసా..?’’ అంటూ తన తండ్రి గిఫ్టుగా ఇచ్చిన పోలీస్ బెల్టుతో చరణ్ ను రెండు దెబ్బలేశారట! ఆ దెబ్బతో భయపడిపోయిన చరణ్.. లైఫ్ లో మళ్లీ బూతులు వాడలేదని చెబుతున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  chiranjeevi  nagababu  mega family  open heart with rk  

Other Articles