Shraddha kapoor item song in for ungli

sraddha kapoor item song, sraddha kapoor song in ungli movie, ungli movie item songs, ungli movie teaser, eemran hashmi upcoming movie, telugu latest news, bollywood latest news

shraddha kapoor item song in for ungli : bollywood hot actress sraddha kapoor danced for a item song in ungli movie on side of eemran hashmi. tuesday released teaser of ungli movie creating huge expectation on ungli movie with sraddha kapoor item song

సన్నీని రీప్లేస్ చేసిన శ్రద్ధా

Posted: 10/29/2014 01:18 PM IST
Shraddha kapoor item song in for ungli

బాలీవుడ్ హాట్ ఐటం బాంబ్ సన్నీ లియోన్ కు కాంపిటిషన్ మొదలయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఐటం రాణిగా ఉండగా..., కొత్తగా మరో తారను ఐటం భామగా చూపిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ‘ఉంగ్లీ’ సినిమాలో బాలీవుడ్ భామ శ్రధ్దా కపూర్ ఐటం సాంగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం విడుదల అయిన ‘ఉంగ్లీ’ టీజర్ లో శ్రధ్ధా చిట్టి పొట్టి బట్టలేసుకుని డాన్స్ ఆడింది. దీంతో ఈ అమ్మడిదే ఐటం సాంగ్ అని అభిమానులు చెప్పకుంటున్నారు. ఇక పాటలో హీట్ పెంచేందుకు మద్యలో ఇమ్రాన్ ఖాన్ వచ్చి జాయిన్ అయినట్లుగా టీజర్ ద్వారా తెలుస్తోంది.

డాన్స్ బసంతీ అంటూ సాగిన పాటలో..., మసక లైట్ల మద్య శ్రధ్ధా తన అందాలను ఆరబోసింది. వెండిపూత పూసినట్లుగా తళుక్కున మెరుస్తున్న బట్టల్లో హాట్ లుక్ తో పాటలోని ఇమ్రాన్ తో పాటు చూస్తున్న అభిమానులకు కూడా హీట్ పెంచేస్తోంది. ఈపాటను అమితాబ్ భట్టాచార్యా రాయగా.., జిగార్ కంపోజ్ చేశారు. సినిమా విషయానికి వస్తే ‘ఉంగ్లీ’ని రెన్సిల్ డి సెల్వ డైరెక్ట్ చేస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ చేస్తుండగా ఖంగనా రనౌత్, రణదీప్ హుడాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీలో ముందుగా ఐటం సాంగ్ కోసం సన్నీ లియోన్ ను తీసుకుందాం అని సినిమా యూనిట్ డిసైడ్ అయింది. అయితే సన్నితో తాను చేయను అని ఇమ్రాన్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో శ్రధ్ధా కపూర్ ను పెట్టి పని కానిచ్చేశారు. ప్రస్తుతం ఈ పాటకు మంచి స్పందన వస్తుండటంతో అమ్మడు తెగ సంతోష పడుతోంది. సన్నీకి షాక్ ఇచ్చిన ఈ పాట మీకోసం అందిస్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ungli  sraddha kapoor  eemran hashmi  item song  

Other Articles