Shweta basu prasad fires on journalists and newspapers who posted about her prostitution case

shweta basu prasad news, shweta basu prasad latest news, shweta basu prasad interview, shweta basu prasad prostitution case, shweta basu prasad bollywood news, shweta basu prasad bollywood interview, shweta basu prasad child artists, shweta basu prasad

shweta basu prasad fires on journalists and newspapers who posted about her prostitution case

వాళ్లను వదిలేదిలేదంటున్న శ్వేతబసు!

Posted: 11/03/2014 03:16 PM IST
Shweta basu prasad fires on journalists and newspapers who posted about her prostitution case

వ్యభిచారం కేసులో అరెస్టయి రెండునెలలపాటు రెస్క్యూహోంలోనే గడిపిన నటి శ్వేతబసుప్రసాద్... ఇటీవల విడుదలై ముంబైలోని తన ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే! అక్కడకు చేరుకున్న అనంతరం ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తనకు సంబంధం లేని విషయాలను అనవసరంగా మీడియావాళ్లు ప్రచురించారని.. అటువంటివాళ్లను తాను వదలనని.. అవసరమైతే కేసు పెట్టేందుకు తాను సిద్ధమని ఆమె ఆగ్రహంతో వెల్లడించింది. తాను చెప్పని విషయాన్ని ఓ మీడియాసంస్థకు చెందిన ఓ జర్నలిస్టు ప్రచురించారని సీరియస్ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను అరెస్టయిన అనంతరం కస్టడీలోనే వున్నాను. రెస్క్యూహోంలో కనీసం నా తల్లి, తండ్రితో కూడా మాట్లాడనివ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను మీడియాతో ఎలా మాట్లాడుతాను. నేను చెప్పని కొన్ని విషయాలను, అవాస్తవాలను ప్రచురించారు. శ్వేతబసు సినీ కెరీర్ ముగిసినట్టేనంటూ నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తను ప్రచురించారు. అలాగే సంపాదన కోసం వేశ్యవృత్తిని కొంతమంది ప్రోత్సహించారంటూ కథనంలో అవాస్తవాలను ప్రచురించారు. ఆ విధంగా అవాస్తవాలను ప్రచురించిన జర్నలిస్ట్, న్యూస్ పేపర్ వివరాలగురించి సేకరిస్తున్నాం. అందుకు బాధ్యలైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని శ్వేత వెల్లడించింది. ‘‘నిజానికి అరెస్ట్ సమయంలో కొన్ని సినీ ఆఫర్లు కూడా తన చేతిలో ఉన్నాయని... సినీ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయని... ఎంతో మంది స్నేహితులు తనకు ఉన్నారని... వారంతా కష్టం సమయంలో వెన్నంటి ఉన్నారని శ్వేతాబసు తెలిపింది.

అలాగే అరెస్టయిన నేపథ్యం గురించి తెలుపుతూ.. ‘‘నేను ఓ అవార్డు ఫంక్షన్ కోసం అక్కడికెళ్లాను. ఆ కార్యక్రమ నిర్వాహకులు నాకు టిక్కెట్లు, హోటల్ గదిని కేటాయించారు. ఆ టిక్కెట్లు ఇప్పటికీ నా దగ్గరే వున్నాయి. అయితే అదే సమయంలో పోలీసులు దాడి చేశారు. ఓ ఏజెంట్ ను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని తెలిపి, నన్ను తీసుకెళ్లారు. కానీ అదే కేసులో నేను బాధిరాలిగా మారాల్సి వచ్చింది. అసలు విషయం బయటకు రాకుండా చేశారు. విచారణ సమయంలో వ్యభిచారానికి పాల్పడిన ఇతర హీరోయిన్ల పేర్లను చెప్పమంటూ పోలీసులు టార్చర్ పెట్టారు. కానీ ఇతరులపై కామెంట్ చేయనని తప్పుకున్నాను’’ అని తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles