Tollywood heros allu arjun ram participated swachh bharat

tollywood heros in swachh bharat, swachh bharat latest news, popular persons in swachh bharat, allu arjun in swachh bharat, hero ram on swachh bharat, nagarjuna on swachh bharat, tollywood latest news

tollywood heros allu arjun, ram participated swachh bharat : tollywood heros ram, nagarjuna participated in swachh bharat programme. hansika, samantha agrees to participate in swachh bharat

టాలీవుడ్ లో మొదలైన ఉద్యమం.. కదిలివస్తున్న తారలు

Posted: 11/06/2014 05:29 PM IST
Tollywood heros allu arjun ram participated swachh bharat

సినిమా స్టార్లు అంటే కేవలం షోకులకే కాదు.., సమాజం హితం కోసం పనిచేసేందుకు కూడా ముందుకవస్తారని టాలీవుడ్ స్టార్లు నిరూపిస్తున్నారు. గతంలో పలు విపత్తులు, ఆపదలు వచ్చినపుడు చేయూతనిచ్చిన నటులు ఇప్పుడు దేశాన్ని శుభ్రం చేసుకునేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించిన ‘స్వఛ్చ భారత్’ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలు చురుకుగా పాల్గొంటున్నారు. ఐస్ బకెట్ చాలెంజ్ మాదిరిగా.., స్వఛ్చభారత్ ఛాలెంజ్ కు అనూహ్య స్పందన వస్తోంది.

రిలయన్స్ అనిల్ అంబానీ చేసిన సవాల్ కు హీరో నాగార్జున స్పందించి స్వఛ్చ భారత్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో పరిసరాలను నాగ్ శుభ్రం చేశాడు. ఆ తర్వాత కింగ్ తన వంతుగా స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కు సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన బన్నీ.., నాగార్జునకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలోనే శుభ్రతా కార్యక్రమంలో పాల్గొంటానని సోషల్ మీడియాలో వెల్లడించాడు. వీరికి తోడు  హీరో నారా రోహిత్ తదితరులు కూడా స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు.

ఇక లోక్ సత్తా అధినేత జేపీ ఛాలెంజ్ స్వీకరించిన హీరో రామ్, ఎల్లారెడ్డి గుడలోని ఓ ప్రభుత్వ పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో రామ్ అభిమానులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన రామ్, భారతీయులంతా రోజు గంటపాటు కష్టపడితే దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చన్నారు. అటు రామ్ ఏకంగా నలుగురు హీరోయిన్లకు సవాల్ విసిరారు. సమంత, హన్సిక, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని నామినేట్ చేశారు. ఇందుకు స్పందించిన హన్సిక, సమంత సవాల్ తాము స్వీకరించామనీ.., త్వరలోనే కార్యక్రమంలో పాల్గొంటామని స్పష్టం చేశారు.

ప్రధాని మోడి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తన వంతుగా స్వఛ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చీపుర్లు పట్టి రోడ్లు, పరిసరాలు శుభ్రం చేస్తున్నారు. బీజి షెడ్యూల్లు, షూటింగులు ఉన్న సమయంలోనూ సమాజం కోసం వీరు సమయం కేటాయించటం అభినందనీయం. వీలయితే మీరూ కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకంటే మన పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత. బనావో భారత్ స్వచ్ఛ్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swachh bharat  nagarjuna  allu arjun  tollywood  

Other Articles