సౌత్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో టాప్ హీరోయిన్ల జాబితాలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్... గతకొన్నాళ్ల నుంచి ఎక్కువ సినిమాలు చేయకుండా కాలక్షేపం చేసిన విషయం తెలిసిందే! ఆమధ్య ఈ అమ్మడు ఒక బిజినెస్ మేన్ తో ప్రేమలో పడిందని.. అతనితో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని.. అందుకే కాజల్ వచ్చిన అవకాశాలను తిరస్కరిస్తూ వస్తోందని వార్తలు వచ్చాయి. ఆ రూమర్లపై కాజల్ కూడా ఏమీ స్పందించలేదు. అయితే కాజల్ కు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ వుండటం వల్ల అక్కడే ఎక్కువ దృష్టి సారించిందని, పారితోషికం కూడా అమాంతంగా పెంచేయడం కారణంగా కాజల్ కు అవకాశాలు వచ్చినట్టేవచ్చి వెనక్కి వెళ్లిపోయాయని ఆ తర్వాత స్పష్టమయ్యాయి. ఇంతలోనే గోవిందుడు కరుణించడంతో ఈ అమ్మడు తిరిగి తెరమీదకు కనిపించింది. ప్రస్తుతం రెండుమూడు సినిమాలతో బిజీగా వున్నట్టు సమాచారం!
ఇదిలావుండగా.. గతంలో ఈ అమ్మడు కాస్త ఇగో ప్రాబ్లమ్ తో హీరో ధనుష్ తో కలిసి చేయాల్సిన ‘‘పొల్లాదవన్’’ చిత్రాన్ని తిరస్కరించింది. అప్పుడు ఆమెను ఎన్నిసార్లు సంప్రదించినా అందుకు సమాధానమివ్వలేదట! దీంతో చిత్రయూనిట్ తోపాటు అభిమానులు కూడా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం! అప్పుడా సినిమాలో వేరే కథానాయికను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఈ దెబ్బతో కాజల్ కు తమిళంలో నూకలు చెల్లిపోయినట్లేనని వార్తలొచ్చాయి కూడా! అయితే ఈ వార్తలకు చెక్ చెబుతూ తాజాగా ధనుష్ ఆమెకు మరొక అవకాశం ఇచ్చినట్లు కోలీవుడ్ సమాచారం! గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల హీరో ధనుష్ తో జతకట్టాల్సిన కాజల్ కు ఆ అవకాశం కొన్ని అనివార్యకారణాల వల్ల మిస్ అయ్యింది. కానీ.. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెకు మళ్లీ తమిళంలో అవకాశం వరించింది.
ఇప్పటికే ‘‘వేలై ఇల్లా పటప్టాదారి’’ చిత్రం సక్సెస్ తో ఫుల్ జోష్ లో వున్న ధనుష్.. ప్రస్తుతం హిందీ చిత్రం షమితాబ్ ను పూర్తి చేసే పనిలో మునిగిపోయాడు. అలాగే అతను నటించిన తాజా తమిళ చిత్రం ‘‘అనేగన్’’ విడుదలకు సిద్ధంగా వుంది. అతని తర్వాతి చిత్రం కూడా బుధవారంనాడే ప్రారంభం అయింది. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలన్న విషయమై ఇన్నాళ్లు తర్జనభర్జనలో మునిగిన ఆ మూవీ యూనిట్.. చివరకు కాజల్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోనే కాజల్ హీరో ధనుష్ తో కలిసి జతకట్టబోతోంది. పైగా ఈ చిత్రంలో ఈ అమ్మడు పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుందని యూనిట్ వర్గాలా సమాచారం! దీంతో తనకు చాలారోజుల తర్వాత తమిళంలో మళ్లీ అవకాశం రావడం వల్ల కాజల్ చాలా సంతోషంగా వుందని సన్నిహితులు పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more