మొన్న వచ్చిన హుధుద్ తుపాను కారణంగా వైజాగ్ నగరం మొత్తం అతలాకుతలమైన సంగతి తెలిసిందే! ప్రాణనష్టం అంతగా జరగలేదు కానీ... ఆస్తినష్టం భారీగానే జరిగింది. దీంతో అక్కడున్న ప్రజలందరూ నిరాశ్రయులై, ఆకలితో అలమటిస్తున్నారు. అయితే వీరందరి క్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గట్టిగానే శ్రమిస్తోంది. మరోవైపు టాలీవుడ్ లో వున్న ప్రముఖులనుంచి చిన్న ఆర్టిస్టులవరకు తమవంతు సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు. కొందరు డబ్బులరూపంలో విరాళాలు సమర్పిస్తుంటే.. మరికొందరు నేరుగా రంగంలోకి దిగి అక్కడున్న ప్రజలకు ఫుడ్ ప్యాకెట్స్, వాటర్, బిస్కెట్స్ ఇలా రకరకాల ఆహారపదార్థాలను సర్వ్ చేస్తున్నారు.
అయితే మూడుపదుల హాట్ భామ శ్రియ శరన్ ఏం చేసిందో తెలుసా..? ఆ విషయం గురించి చర్చించుకోవాలంటే ముందుగా శ్రియ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వుంటుంది. ఇన్నాళ్లవరకు శ్రియా తెరమీద కేవలం హీరోయిన్ గా మాత్రమే అందరికీ పరిచయమైంది.. రియల్ లైఫ్ ఆమె స్వభావం ఏమిటి..? ఇష్టాయిష్టాలేంటి..? వారిలో దాగివున్న ప్రతిభలేంటి..? అనే విషయాలు అంతగా బయటకు రాలేదు. ఆ విషయాలను ఆమె ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. అయితే హుధుధ్ బాధితుల కోసం ఆమె తనలో దాగివున్న కళను బయటపెట్టింది. అందరి తారలకంటే భిన్నమైన పద్ధతిలో ఆమె బాధితుల కోసం విరాళాలు సేకరించే పనిలో మునిగిపోయింది.
శ్రియా కేవలం అందమైన హీరోయిన్ మాత్రమే కాదు.. అందంగా బొమ్మలు వేసే ఒక పెయింటర్ కూడా! చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా నేర్చుకున్న ఈ కళను ఏనాడూ తెలియపరచలేదు కానీ.. ఇప్పుడు ఆ కళకు పనిచెప్పింది. ఉత్తరాంధ్రను పూర్తిగా కుదిపేసి హుధుద్ తుపాను బాధితుల సహాయం కోసం ఈమె చాలారోజుల తర్వాత మళ్లీ కుంచె పట్టింది. శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడి పెయింటింగులు వేసి.. బాధితుల సహాయనిధికి ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ కు పంపించింది. ఆదివారం (09-11-2014)నాడు హైదరాబాదులో జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఈ బొమ్మలను కూడా చూపిస్తారు.
ఈ విషయమై శ్రియ మాట్లాడుతూ.. ‘‘విశాక నగరంతో నాకు ఎంతో అనుబంధం వుంది. నటిగా నేను మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిలబడింది అరకులోయలోనే. అంతేకాదు.. అక్కడి ప్రేక్షకులు కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తారు. అందుకే.. ఆ ప్రాంతం సహాయార్థం ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని చెప్పగానే నేను వేసిన రెండు పెయింటింగులు పంపించాను’’ అని చెప్పింది ఈ అందాలతార. మరి.. శ్రియా వేసిన ఈ పెయింటింగులు ఏ రేటుకి అమ్ముడుపోతాయో చూడాలి!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more