Sundeep kishan next movie name beeruva confirmed

sundeep kishan next movie, sundeep kishan latest news, joru collections review, joru movie reviw and rating, beeruva movie release date, beeruva latest updates, tollywood latest news

sundeep kishan next movie name beeruva confirmed : young hero sundeep kishan latest movie name is beeruva confirmed by hero suneep. usha kiran movies and anandi art creations combination movie name is biruva with hero sundeep kishan

టైటిల్ తో డబ్బులు దాచేస్తాడా..?

Posted: 11/10/2014 03:56 PM IST
Sundeep kishan next movie name beeruva confirmed

వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న యంగ్ హీరో సందీప్ కిషన్, తాజా మూవీ పేరు ఖరారైంది. కొత్త సినిమాకు ‘బీరువా’ అనే టైటిల్ పెట్టినట్లు కిషన్ స్వయంగా ప్రకటించాడు. దీనికి క్యాప్షన్ ‘సంజుగాడి ఫ్రెండ్’ అని చెప్పాడు. ప్రస్తుతం సినిసినిమా షూటింగ్ పూర్తికాగా.., ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.

‘నా ఊపిరి’ ఫేం కన్మణి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. ప్రతిష్టాత్మక ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లు కంబైన్డ్ గా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సందీప్ సినిమాకు తమన్ సంగీతం అందించటం ఇదే తొలిసారి. హీరోయిన్ వచ్చేసి సురభి. సినిమాలో బీరువా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందని డైరెక్టర్ కన్మణి వెల్లడించాడు.

కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాత్మక, ఎంటర్ టైనింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందీప్ కిషన్ యువ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రమంగా సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తు ముందుకు వెళ్తున్నాడు. ఆ కోవలోనే గత ప్రాజెక్టులతో పోలిస్తే ‘జోరు’లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజా సినిమాలో వీటిని మరింత పెంచినట్లు సమాచారం. మరి ‘బీరువా’ ఏ మేరకు డబ్బులు దాచుకునేలా చేస్తుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sundeep kishan  beeruva  latest news  tollywood  

Other Articles