Trisha krishnan love affairs controversial comments

trisha krishnan, trisha krishnan hot photos, trisha hot photos, trisha latest news, trisha news, trisha photo shoot, trisha interview, trisha twitter, trisha, daggubati rana, tollywood news, telugu news

trisha krishnan love affairs controversial comments : trisha finally express her odd feelings on love that she don't believe

వామ్మో! అది పెద్ద రిస్కుతో కూడిన వ్యవహారం!

Posted: 11/15/2014 03:26 PM IST
Trisha krishnan love affairs controversial comments

నిన్నమొన్నటివరకు సినిమాలు లేక అల్లాడిపోయిన త్రిష.. కన్నడ ‘‘దూకుడు’’ భారీ విజయం అందుకోవడంతో తిరిగి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. వచ్చిన ప్రతి ఆఫర్ ను వదులుకోకుండా అంగీకరిస్తూ పోతోంది. ఈనేపథ్యంలోనే అమ్మడు బాలకృష్ణ సరసన ‘లయన్’ చిత్రంతోపాటు తమిళ, కన్నడ భాషలో చెరొకటి సినిమాలతో బిజీగా వుంది. దీంతో ఈ అమ్మడు ఫుల్ జోష్ లో వుంది. ఇదిలావుండగా.. అప్పుడప్పుడు తారలు ప్రేమాయణం నడుపుతున్నట్లు రూమర్లు రావడం సహజమే! ఇలాంటి పుకార్లు త్రిష మీద కూడా చాలానే వచ్చాయి. ఈ అమ్మడు రానాతో కలిసి ప్రేమాయణం నడుపుతోందని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే వుందంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకునే ‘‘ప్రేమ’’ మీద తన అభిప్రాయమేంటో తెలపాల్సిందిగా అడిగితే... అదొక నాన్సెన్స్ అంటూ బదులిచ్చింది.

ఈ నేపథ్యంలోనే త్రిష్ మాట్లాడుతూ.. ‘‘రేమ అనేది పెద్ద రిస్కుతో కూడిన వ్యవహారం. దానికోసం చాలా టైం పెట్టాలి... ఒకవేళ మన ప్రేమ సక్సెస్ కాకపోతే అప్పుడు మన పరిస్థితి ఏమిటి చెప్పండి? ఒకవేళ సక్సెస్ అయిందే అనుకోండి, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?’’ అని తిరిగి ప్రశ్నిస్తోంది అమ్మడు. ఏదైతేనేం.. ఈ మూడుపదుల భామ ప్రేమ మీద తనలో వున్న ద్వేషాన్ని ఒక్కసారిగా కక్కేసింది. మొన్నటివరకు రానాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ సెక్సీ తార.. ఒక్కసారిగా ప్రేమ మీద ఇంతగా నెగెటివ్ కామెంట్లు చేయడం వెనక కారణం ఏమైవుంటుందని సందేహాలు వెలువడుతున్నాయి. బహుశా రానాతో లవ్ ఫెయిల్యూర్ అవడం వల్లే ఇలా ప్రేమ మీద ద్వేషం పెంచుకుందని విశ్లేషకులు అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha krishnan  daggubati rana  celebrities love affairs  telugu news  tollywood  

Other Articles