Aamir khan on arpita marriage and salman shahrukh relation

aarmir khan on arpita marriage, aamir khan on salman shahrukh freindship, aamir khan on his movies, aamir khan latest update, arpita marriage update, arpita wedding photos highlights, arpita khan honeymoon tour place, arpita khan reception, salman khan gift to arpita, bollywood latest updates, tollywood latest news updates

aamir khan on arpita marriage and salman shahrukh relation : bollywood star aamir khan responds on arpita wedding cermony says about his experience and also how he faces problem from shahrukh khan and salman khan on sangeeth celebrations

అర్పిత పెళ్ళితో అమీర్ కు ఇబ్బందులు

Posted: 11/20/2014 10:09 AM IST
Aamir khan on arpita marriage and salman shahrukh relation

వెంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లుగా.., అర్పితా ఖాన్ పెళ్ళి.., అమీర్ ఖాన్ ను ఇబ్బంది పెట్టిందట. ఈ విషయం స్వయంగా పీకే హీరోనే చెప్పాడు. పెళ్ళికి ముందు జరిగిన సంగీత్ కార్యక్రమం తనను నిద్రలేకుండా చేసిందన్నారు. సంగీత్ కు తాను రాకపోయినా.., చాలా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. అదెలాగంటే చాలా కాలంగా మాటల్లేని సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ అర్పిత పెళ్ళి సందర్బంగా కలిశారు. సంగీత్ రోజు ఇద్దరు కలుసుకున్నారు. ఈ విషయాన్ని రాత్రి ఒంటిగంటకు ఫోన్ చేసి ముందు అమీర్ కే చెప్పారట. ఆ తర్వాత రెండున్నరకు మరోసారి ఫోన్ చేసిన ఇండస్ర్టీ మిత్రులు నాన్ స్టాప్ గా మాట్లాడారట.

తెల్లారినా వీరి మాటలు మాత్రం ఆగలేదు అని అమీర్ ఖాన్ నవ్వుతూ మీడియాకు చెప్పాడు. అలా అర్పిత సంగీత్ లో పాల్గొనకపోయినా పడుకోకుండా గడిపాను అని తన అనుభవం చెప్పుకొచ్చాడు. నవంబర్ 18న హైదరాబాద్ లోని ఫలక్ నమా ప్యాలెస్ లో అయుష్ శర్మతో అర్పిత వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు హాజరయ్యారు. ఇక ఈనెల 21న అంటే శుక్రవారం రోజు ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో కొత్త జంట రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  salman khan  shahrukh khan  arpita  bollywood  

Other Articles