Ramgopal varma comments on lord venkateshwara and yadagiri narasimha

ramgopal varma comments on lord venkateshwara, ramgopal varma on tirumala venkateswara, ramgopal varma on yadagirigutta, ramgopal varma on lord narasimha, ramgopal varma latest comments on gods, yadagirigutta temple timings, yadagirigutta temple ticket reseravation, tirumala tirupati ticket reservation, tirumala temple timings, tirumala trains, ram gopal varma movie news updates

ramgopal varma comments on lord venkateshwara and yadagiri narasimha : controversy director ramgopal varma again tweets a contorversy comment he says why telangana people prays tirumala balaji more even they had yadagiri narasimha, ramgopal varma praises telangana cm kcr for developing yadagiri gutta and at the same time he criticises telangana people for praying venkateswara more than narasimha

ఆ పిట్టను ఇష్టం వచ్చినట్లు వాడుతున్నాడు

Posted: 11/20/2014 11:25 AM IST
Ramgopal varma comments on lord venkateshwara and yadagiri narasimha

వివాదాస్పద కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి తన పైత్యం బయట పెట్టుకున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఒకే అంశాన్ని తీసుకుని దేవుళ్ళ మద్య చిచ్చు పెట్టాడు. ఇదే సమయంలో తెలంగాణ సీఎంను నిచ్చనె ఎక్కించాడు. ఇక విషయానికి వస్తే తాజాగా ట్విట్టర్ లో దేవుళ్లపై వర్మ కామెంట్ చేశాడు. తెలంగాణ వారికి యాదగిరి గుట్ట ఉన్నా.., వారు ఎక్కువగా బాలాజీనే ఎందుకు పూజిస్తారు అని ప్రశ్నించారు. ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి అని సూచించాడు.

ఆంధ్రా దేవుడైన తిరుమల శ్రీనివాసుడిని పూజించటం అంటే.., తెలంగాణ దేవుడు నరసింహుడిని అవమానించటమే కదా అన్నాడు. తనకు దేవుళ్ళపై నమ్మకం లేకపోయినా ఆయన్ను నమ్మేవారు విలువ తెలుసుకోవాలని తన ఉద్దేశ్యం అన్నారు. ఇక ఇదే సమయంలో కేసీఆర్ ను తెగ పొగిడేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తున్నారని.., ఇందుకు తాను సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఇది చూసి అయినా తెలంగాణ ప్రజలు నరసింహుడి విలువ తెలుసుకుని ఆయన్ను ఎక్కువగా పూజిస్తారని అనుకుంటున్నట్లు రామ్ కామెంట్ చేశాడు.

గతంలో కూడా వినాయక చవితి రోజున గణపతిపై కామెంట్ చేసి వివాదాస్పదం అయ్యాడు. వర్మకు సంచలన కామెంట్లు చేయటం కొత్తేమి కాదు. కానీ ఆయనగారి దూకుడు వల్ల ట్విట్టర్ పిట్ట నలిగిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూ ట్విట్టర్ లో సెర్చ్ ఐకాన్ గా మారిపోతున్నారు. ఇలా వివాదాస్పద కామెంట్లు అనుమతిస్తే భవిష్యత్తులో వర్మ అకౌంట్ ట్విట్టర్ బ్లాక్ చేయవచ్చు. ఈ పైత్యం మరీ ఎక్కువయితే ప్రభుత్వమే ట్విట్టర్ ను బ్లాక్ చేయవచ్చు. ఈ రెండింటిలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramgopal varma  latest news  tirumala venkateshwara  lord  

Other Articles